ప్రభాస్ విషయంలో సానుకూలంగా స్పందించిన జగన్ ప్రభుత్వం

Sunday, August 25th, 2019, 01:02:21 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం సాహో… కాగా ఈ సాహో సినిమాకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. కాగా ప్రభాస్ తాజగా నటించిన సాహో చిత్రం ఈనెల 30 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవబోతుంది. ఇప్పటికే విడుదలైనటువంటి ట్రైలర్ మరియు పాటల ద్వారా ఈ చిత్రానికి ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్న ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ప్రతీ సినిమా ప్రేక్షకుడు కూడా ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈమేరకు సాహో సినిమా విషయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఈ సినిమాకు సంబందించిన నిర్మాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ సినిమాను సుమారు రూ.350 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారని సమాచారం. అయితే ఈ సినిమా విడుదలైన మొదట్లోనే భారీ వసూళ్లను సాధించాలని నిర్మాతలు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా ఈ సినిమా రిలీజైన తర్వాత తొలి రెండు వారాల పాటు ధియేటర్లలో టికెట్ రేట్లు పెంచేందుకు ప్రభుత్వ అనుమతి కోరగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు… అంటే ప్రస్తుతానికి ఈ సినిమా విడుదలైన వారం రోజుల పాటు టిక్కెట్ల రేట్లు అధికంగా మారనున్నాయని సమచారం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో కూడా పెద్ద సినిమాల విషయంలో ఇలాంటి కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారని తెలుస్తుంది. అయితే ఇలాంటి విజ్ఞప్తిని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు పెట్టగా, కెసిఆర్ నుండి ఇంకా ఎలాంటి అనుమతులు రాలేదని సమాచారం…