పవన్ కళ్యాణ్ చేతిపై టాటూ.. అదే కారణం..!

Monday, February 10th, 2020, 10:49:44 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత ఇటీవల కొత్త లుక్‌లో కనిపించారు. అజ్ఞాతవాసి సినిమా తరువాత పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టి సారించిన ఇటీవల పవన్ మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఎన్నికల ముందు నుంచి గడ్డంతో కనిపించిన పవన్ చాలా రోజుల తరువాత క్లీన్ సేవ్‌లో కనిపించారు.

అయితే ప్రస్తుతం పింక్ సినిమా రీమేక్ షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల కర్నూల్ జిల్లా పాణ్యం నియోజకవర్గ జనసేన కార్యకర్తలతో సమావేశమైన పవన్ క్లీన్ సేవ్‌లో కనపడడమే కాకుండా ఆయన చేతిపై టాటూ కనిపించింది. అయితే దీని వెనుక అసలు సీక్రేట్ ఏంటో బయటపడింది. క్రిష్‌తో చేస్తోన్న సినిమా కోసం పవన్ టెంపరరీ గద్ద టాటూ వేయించుకున్నాడని 18వ శతాబ్దం నాటి మొఘల్‌ పాలన నేపథ్యంలో ఈ కథ తెరకెక్కనుందని, తెలంగాణ రాబిన్ హుడ్‌గా పేరు పొందిన పండుగ సాయన్న జీవితగాథ ఆధారంగా ఈ సినిమాను నిర్మించబోతున్నట్టు సమాచారం.