సినిమా భవిష్యత్తుని డిసైడ్ చేస్తున్న ఈ 5 సన్నివేశాలు…

Saturday, January 12th, 2019, 12:05:33 AM IST

బోయపాటి గారు తీసిన వినయ విధేయ రామ చిత్రం చాలా దారుణం గా ఉందని అందరు అంటున్నారు. అసలు సాధ్యపడని విషయాలన్నీ ఈ సినిమాలో సాధ్యం చేసి చూపించారు. అసలు ఎందుకు ఈ సినిమాకి వచ్చామా అని తలలు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. మరీ ఇంత దారుణంగా తీసారా అని అందరు విమర్శలు చేస్తున్నారు.

1. నేను చావు బతుకుల్లో ఉన్నా.. వచ్చి కాపాడు తమ్ముడూ అని అన్నయ్య ఎక్కడో బీహార్ నుండి లొకేషన్ షేర్ చేస్తే.. గుజరాత్ ఎయిర్ పోర్ట్‌లో ఉన్న హీరో అద్దాలను బద్దలు కొట్టుకుంటూ బైటకొచ్చి ఓ బ్రిడ్జ్ మీద నుండి డైరెక్ట్‌గా బీహార్ వెళ్లే ట్రైన్ మీదకి దూకి ట్రైన్‌పైనే నిలబడి వందలాది కిలోమీటర్లు జర్నీ చేసి క్షణాల్లో ఆపదలో ఉన్న అన్నని కాపాడేయడం ఏంటి?

2. ఏంటీ.. రామ్ చరణ్ విలన్స్ తల నరికితే తలలు ఆకాశంలో ఎగిరిపోతాయా? పైగా వాటిని ఆకాశంలో తిరగే గద్ధలు ఎత్తుకుపోతాయా?

3. ఇండియన్ ఆర్మీకి సాధ్యం కాని పని ఎక్కడో వైజాగ్ నుండి వచ్చిన ఒకే ఒక్కడు రామ్ కొణెదెల.. మూడొందల మందిని మట్టుబెట్టి భూమిలో పాతిపెట్టిన కాంక్రీట్ దిమ్మల్ని ఫటా ఫటా లాగేసి గోలీలు ఆడినంత ఈజీగా కాంక్రీట్ దిమ్మలతో బంతాట ఆడేయడం ఏంటో..

4. అడవిలో దొరికిన విషసర్పం విలన్‌ని కాటు వేస్తే అతడు చనిపోకుండా.. తిగిరి పామే చనిపోతుందా? వహ్ వా!! ‘బయోలజీ’ గురించి విన్నాం కాని కొత్తగా ‘బోయాలజీ’ చూపించావ్ కద సామీ.

5. పోనీ క్లైమాక్స్ వరకూ ఓపికతో ఎలాగోలా థియేటర్స్‌లో కూర్చున్న ప్రేక్షకుడికి లాస్ట్ ఫైట్‌లో అయినా బోయపాటి మార్క్ చూపిస్తారు అనుకుంటే.. సింపుల్‌గా విలన్ తలను మొండాన్ని వేరు చేసి రెండు ముక్కలు చేసి పెట్టావ్.

వీడియో ఇక్కడ క్లిక్ చెయ్యండి