“అల వైకుంఠపురములో” హిట్టవుతుంది అనడానికి కొన్ని కారణాలు!

Friday, December 13th, 2019, 03:36:10 PM IST

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబోకు టాలీవుడ్ లో ఒక స్పెషల్ గుర్తింపు ఉన్న సంగతి అందరికి తెలిసిందే.అలా ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో అంచనాలు ఆటోమాటిక్ గా పెరిగిపోతాయి.అయితే ఇటీవలే విడుదల కాబడిన టీజర్ చూసాక మాత్రం ఈ సినిమాపై చాలా మంది అప్పటి వరకు ఆశలు పెట్టుకున్న వారు నీరుగారిపోయారు.ఎందుకంటే టీజర్ లో అప్పటికే చూసిన రొటీన్ స్టఫ్ త్రివిక్రమ్ మళ్లీ గట్టిగా దట్టించేలా ఉన్నాడని అర్ధం అయ్యిపోయింది.

దీనితో ఈ సినిమా ఇక హిట్టు కావడం కష్టమే అని అంతా భావించారు.సరే ఈ అంచనాలను భావనలను పక్కన పెట్టి అసలు ఈ చిత్రం ఎందుకు హిట్ కాదు?ఒకవేళ హిట్ కావడానికి కారణాలు ఏమిటో చూద్దాం.మొట్ట మొదటి ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది అల్లు అరవింద్ అని చెప్పాలి.అల్లు అరవింద్ నిర్మాతగా ఎలాంటి చిత్రాలను టేకప్ చేస్తారో అందరికి తెలుసు.ముందు కథ విని ఖచ్చితంగా హిట్టవుతుంది అని అనిపిస్తేనే ప్రొడ్యూస్ చేసి సేఫ్ గేమ్ ప్లే చేస్తారు.ఇది మొట్టమొదటిది.

ఇక రెండో పాయింట్ ఏమిటంటే ఇప్పటికే సినిమా “అజ్ఞ్యాతవాసి” అని ఒక అంచనాకు అంతా వచ్చేసారు.అలాగే త్రివిక్రమ్ కెరీర్లోనే ఆ చిత్రం ఘోరమైన ప్లాప్.అలాంటప్పుడు త్రివిక్రమ్ మళ్ళీ అదే చిత్రంలా తెరకెక్కిస్తారు అనుకోవడం ఖచ్చితంగా పొరపాటే అవుతుంది.సో ఇలా కూడా ఈ చిత్రం హిట్టయ్యే అవకాశం ఉంది.అలాగే ఈ చిత్రం టీజర్ ను ఒక్కసారి చూసి మొత్తం ఎలా ఉంటుందో జడ్జ్ చేసెయ్యడం కూడా కరెక్ట్ కాదు.గమనించారో లేదో మొదటి చూసినప్పుడు కంటే కూడా తర్వాత తర్వాత చూస్తే సినిమాలో ఏదో మ్యాటర్ ఉన్నట్టే కొడుతుంది.మరి ఈ కారణాలు అన్ని సఫలం అవుతాయో లేదో చూడాలి.