ఆ వెబ్ సిరీస్ లో రాణా, అల్లరి నరేష్…క్లారిటీ వచ్చేనా!

Friday, July 10th, 2020, 10:05:49 PM IST


ప్రపంచ దేశాలను భయాందోళన లో ముంచెత్తిన కరోనా వైరస్ మహమ్మారి, ఏ ఒక్క రంగాన్ని వదిలిపెట్టలేదు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సినిమా రంగం పరిస్థతి అస్తవ్యస్తం అయింది. సినిమాల విడుదల లేకపోవడం తో అంతా ఆన్లైన్ బాట పట్టారు. అంతేకాక ఇక భవిష్యత్ కూడా ఆన్లైన్ లోనే ప్రేక్షకులు ఎక్కువగా సినిమాల్ని ఆదరించే పరిస్తితి ఏర్పడింది. అయితే ఈ మేరకు ఏకె ఎంటర్టైన్మెంట్ ఒక వెబ్ సిరీస్ ను ప్లాన్ చేసింది. రచయిత మధుబాబు రాసిన షాడో నవల ఆధారంగా ఒక వెబ్ సిరీస్ ను ప్లాన్ చేసింది.

అయితే ఈ వెబ్ సిరీస్ కోసం ఇద్దరు టాలీవుడ్ ప్రముఖ హీరోలను తీసుకొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఆ రెండు పాత్రలకు గానూ దగ్గుబాటి రాణా, అల్లరి నరేష్ లను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే వారిని సంప్రదించగా వారు ఎలా స్పందించారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు ఆ హీరోలు అంగీకరిస్తారో లేదో చూడాలి. అయితే అందుకు సంబంధించిన నిర్మాణ సంస్థ మాత్రం ప్రి ప్రొడక్షన్ పనులు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.