“పెంగ్విన్” కు అక్కడే పెద్ద దెబ్బ పడిందా?

Friday, June 19th, 2020, 04:40:41 PM IST

లాక్ డౌన్ కారణంగా నేరుగా ఓటిటి లోకే వచ్చిన పలు టాప్ నటుల సినిమాల్లో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ చిత్రం “పెంగ్విన్” కూడా ఒకటి. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ శుక్రవారం అర్ధ 12 రాత్రి పన్నెండు గంటలకు డిజిటల్ ప్రీమియర్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది.

టీజర్ మరియు ట్రైలర్స్ తో మంచి ఇంపాక్ట్ ను నమోదు చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఊహించని విధంగా జస్ట్ యావరేజ్ టాక్ ను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. ఇప్పటికే తమిళ్ మరియు మన తెలుగులో వస్తున్న సైకో థ్రిల్లర్స్ ఎంతగానో ఆకట్టుకుంటుండంతో ఆ తరహా సినిమాలను ఇష్టపడే ఫ్యాన్స్ ఈ సినిమా విషయంలో మాత్రం బాగా నిరాశ చెంది ఉంటారు.

అసలు ఈ సినిమాకు దెబ్బ పడిందే ఆ సైకో రోల్ విషయంలో అని చెప్పాలి. ఆ రోల్ కు ఒక ఫిమేల్ లీడ్ ను చూపించడం కాస్త యూనిక్ గా ఉన్నా దానిని కాస్తా జస్ట్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కించడం అనేది బాగా నిరాశ పరిచే అంశంగా మారిపోయింది. ఈ ఒక్క రోల్ ను వేరేలా చూపించి ఉంటే రిజల్ట్ ఖచ్చితంగా ఇంకోలా ఉండటం ఖాయం అని చెప్పాలి.