మెగాస్టార్ 152పై గట్టిగ వినిపిస్తున్న బజ్ ఇదే.!

Sunday, October 20th, 2019, 06:38:38 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం “సైరా నరసింహా రెడ్డి” ప్రస్తుతం థియేటర్లలో ఉంది.ఈలోపే మెగాస్టార్ మళ్ళీ తన మరో మెగా ప్రాజెక్ట్ ను మొదలు పెట్టేసారు.హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివతో ఓ చిత్రాన్ని ప్రకటించేసారు.ఈ చిత్రంపై కూడా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రం కూడా ఒక సందేశాత్మక చిత్రం గానే తెరకెక్కుతుంది అని వార్తలొస్తున్నాయి.అలాగే ఈ చిత్రానికి సంగీతం దేవి ఇవ్వడం లేదని కూడా కన్ఫర్మ్ అయ్యిపోయింది.

అయితే ఇప్పుడు మరోసారి ఈ చిత్రంపై ఓ బజ్ గట్టిగా వినిపిస్తుంది.ఈ చిత్రంలో చిరు సరసన మరోసారి త్రిష కనిపించబోతుంది అని ఇది వరకే వార్తలొచ్చాయి.ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆ వార్తలు నిజమే అని తెలుస్తుంది.ఈ మెగా ప్రాజెక్ట్ లో దాదాపు త్రిష ఖరారు అయ్యిపోయినట్టే అని ఇప్పుడు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది.అయితే ఇంకా అధికార ప్రకటన అయితే రాలేదు కానీ ఇప్పుడు ఈ చిత్రంపై ఈ బజ్ ఎక్కువగా వినిపిస్తుంది.మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.