అక్కినేని మెగా మల్టీస్టారర్ అందుకే వాయిదా పడింది.!

Wednesday, December 11th, 2019, 08:01:37 PM IST

యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున లోని రొమాంటిక్ యాంగిల్ ను చాలా ఏళ్ల తర్వాత పర్ఫెక్ట్ గా చూపించిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన “సోగ్గాడే చిన్నినాయనా” అని చెప్పాలి ఆ సినిమాలో బంగార్రాజుగా కింగ్ నాగార్జున అక్కినేని అభిమానులు అందరికి ఒక్కసారిగా ఫుల్ మీల్స్ పెట్టింది.అలా నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా కూడా నిలిచింది.

అయితే ఈ చిత్రం ఇంత పెద్ద హిట్టయ్యాక దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేసి దానికి “బంగార్రాజు” అని పేరు కూడా పెట్టేసారు.దీనిలో నాగార్జున తో పాటుగా తన తనయుడు నవ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కూడా నటిస్తున్నాడని తెలియగానే అక్కినేని ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహం రేకెత్తింది.కానీ అనూహ్యంగా ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశ వరకు చేరుకోలేదు.

అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ చిత్రం అయితే ఇంకా లైన్ లో ఉందని ఆ సినిమా తాను నాగార్జున తప్పకుండా నటిస్తున్నామని కాకపోతే ప్రస్తుతానికి ఈ సినిమా వెర్షన్ లు నాగార్జునకు అంతగా నచ్చడం లేదని అందుకే కథలో మార్పులు చేర్పులు చేస్తున్నామని అందుకే ఇంకా ఈ చిత్రం మొదలు కాలేదని చైతు ప్రస్తుతం తన మామ వెంకీతో నటిస్తున్న “వెంకీ మామ” సినిమాకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.