“ఆచార్య”లోకి చరణ్ మళ్ళీ రావడానికి కారణం ఇదే.!?

Sunday, March 22nd, 2020, 09:17:06 PM IST


మెగాస్టార్ చిరంజీవి మరియు వరుస విజయ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “ఆచార్య” విషయంలో ఎప్పటికప్పుడు ఒక సస్పెన్స్ అలా కంటిన్యూ అవుతూనే వస్తుంది.కానీ ఇప్పటికి ఈ సినిమాపై కొనసాగుతూ వస్తున్న సస్పెన్స్ ఒక కొలిక్కి వచ్చింది.

ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ అండ్ కీ రోల్ ను రాసుకున్న కొరటాల దాని కోసం మొదట రామ్ చరణ్ పేరును అనుకున్న సంగతి అందరికీ తెలిసిందే.కానీ దాని తర్వాత అది కాస్తా మహేష్ దగ్గరకు వచ్చింది.దాదాపు మహేష్ ఆ రోల్ కు కన్ఫర్మ్ అనే లోపు ట్విస్ట్ ఇస్తూ మళ్ళీ రామ్ చరణ్ దగ్గరకే ఆ రోల్ వచ్చింది.

కానీ మళ్ళీ రామ్ చరణ్ రేస్ లోకి ఎందుకు వచ్చారు అన్న అనుమానం ఇప్పటికే చాలా మందికి వచ్చి ఉండొచ్చు.మొదట రామ్ చరణ్ RRR లో నటిస్తూనే ఇందులో కూడా నటిస్తారని తెలిసింది.కానీ అనూహ్యంగా రాజమౌళి ప్లాన్స్ మార్చడంతో చరణ్ రెండిటినీ మేనేజ్ చెయ్యడం కష్టమయ్యే వదులుకున్నారు.కానీ ఇప్పుడు RRR పోస్ట్ పోన్ అయ్యాక సమయం ఉంటుండడంతో మళ్ళీ చరణ్ ఈ సినిమా చేసేందుకు రేస్ లోకి వచ్చారని తెలుస్తుంది.