గాసిప్స్ : “అల వైకుంఠపురములో” ఈ పోస్టర్ వెనుక వేరే కథ ఉందా.?

Tuesday, January 14th, 2020, 04:18:22 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కెరీర్ వచ్చిన మూడో చిత్రం “అల వైకుంఠపురములో” వారిద్దరికీ కనీ వినీ ఎరుగని అఖండ విజయాన్ని మొదటి ఆట నుంచే ఇచ్చింది.అయితే ఎంతో మంచి రెస్పాన్స్ రాబట్టుకున్న ఈ చిత్రం ఓ విషయంలో మాత్రం బాగా అతి చేసి సోషల్ మీడియాలో నవ్వులు పాలయ్యింది.అదే మొదటి రోజే 85 కోట్ల గ్రాస్ రాబట్టింది అని ఒక పోస్టర్ ను విడుదల చెయ్యడం.సడెన్ గా ఈ పోస్టర్ చూసే సరికి ఎవరో కావాలని చేసి ఫేక్ పోస్టర్ పెట్టి ఉంటారు అని అనుకోని ఉండొచ్చు.

కానీ సీన్ కట్ చేస్తే నిజంగానే ఆ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసారు.అసలు ఎంతో భారీ ప్లానింగ్ తో వస్తేనే కానీ మెగాస్టార్ చిరు నటించిన “సైరా” చిత్రానికి ఆ స్థాయి వసూళ్లు రాలేదు.అలాంటిది దానిని మించిన వసూళ్లు అంటే ఎవరు నమ్ముతారు?అయితే దీనంతటి వెనుక ఒక బలమైన కారణం ఉన్నట్టు సినీ వర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి.నిజానికి ఈ ఐడియా అల్లు అర్జున్ దే అని అంటున్నారు.ఎందుకంటే అసలు కొంతమంది చేస్తున్న ఫేక్ వసూళ్ల ప్రచారాలకు చెక్ పెడదాం అనే ఇలా చేసారని ఒకేసారి ఇంత వేస్తే మిగతా వాళ్ళు డబ్బాలు కోసం చేసుకుంటున్న ప్రచారం అయినా సరే ఆపుతారేమో అన్న ధోరణిలో ఈ పోస్టర్ ను కావాలనే విడుదల చేసారని తెలుస్తుంది.