ఈ సినిమా ట్రైలర్ కూడా ఇంకా రాలేదా?

Wednesday, May 20th, 2020, 10:51:16 AM IST

ప్రస్తుతం మన దేశంలో లాక్ డౌన్ వలన అనేక సినిమాల విడుదల నిలిచిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. దీనితో చిన్న మరియు మీడియం బడ్జెట్ సినిమా మేకర్స్ చేసేది ఏమి లేక తమ సినిమాలను డిజిటల్ గా విడుదల చేసేందుకు పూనుకున్నారు.

అలా మన దేశంలోని అన్ని ముఖ్య భాషల సినిమాలు ఇప్పుడు డిజిటల్ గా వచ్చేస్తున్నాయి. అయితే కోలీవుడ్ జ్యోతిక నటించిన తాజా చిత్రం “పొన్మగళ్ మందల్” చిత్రం విషయంలో అక్కడ పెద్ద రచ్చే జరిగింది. కానీ ఫైనల్ గా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయ్యేందుకు రెడీ అయ్యింది.

అయితే ఈ సినిమాను ఈ మే 29 నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకు రానుండగా ఈ సినిమా ట్రైలర్ ఇంకా రాకపోవడం విశేషం. అయితే ఈ చిత్రం తాలూకా ట్రైలర్ ఈ మే 21 న విడుదల కాబోతున్నట్టు ఇప్పుడు సమాచారం. ఎప్పటి నుంచో హాట్ టాపిక్ అవుతున్న ఈ చిత్రం తాలూకా ట్రైలర్ కూడా ఇంకా రాకపోవడం కాస్త ఆశ్చర్యకరమే అని చెప్పాలి.