ఈ విజయం ప్రవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అంకితం!

Tuesday, July 21st, 2020, 11:52:14 PM IST

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం పవర్ స్టార్, ఎన్నికల ఫలితాల తర్వాత అంటూ కాప్షన్ కూడా పెట్టారు. అయితే ఈ చిత్రం నుండి గడ్డి తింటావా అనే పాటను యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు రామ్ గోపాల్ వర్మ. అయితే ఈ పాటకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అయితే ఈ పాట 17 మిలియన్ వ్యూస్ ను రాబట్టడం తో ఈ విజయాన్ని ప్రవన్ కళ్యాణ్ అభిమానులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన మరొక విషయాన్ని సైతం వెల్లడించారు.

ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఆర్జీవీ వరల్డ్ ధియేటర్ లో విడుదల చేయనున్నారు. అయితే ఈ ట్రైలర్ ను చేసేందుకు 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అని తెలిపారు. అయితే మరొక పోస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటి, రవితేజ అభిమానులు ఈ గడ్డి తింటావా అనే పాట ను 20 లక్షల వ్యూస్ ను చేరుకొనెలా చేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. అయితే ఆర్జీవీ చేసిన ఈ రెండు పోస్టులు ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.