మొట్టమొదటి సారి టెలివిజన్ స్క్రీన్ పై ఈ సీనియర్ నటి.!

Tuesday, June 30th, 2020, 04:00:23 PM IST

మన తెలుగులో అనేకమంది నటులు టెలివిజన్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు అలాగే సిల్వర్ స్క్రీన్ నుంచి స్మాల్ స్క్రీన్ వరకు వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. అలా సెకండ్ ఇన్నింగ్స్ లా కానీ లేదా గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన చాలా సీనియర్ టాలీవుడ్ నటులు ఉన్నారు.

అలా ఇప్పుడు మన టాలీవుడ్ కు చెందిన ఒక సీనియర్ నటి మొట్ట మొదటి సారిగా ఓ తెలుగు ఛానెల్లో కనిపించనున్నారు. ఆమే ప్రభాస్ మరియు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలకు తల్లి పాత్రలో కనిపించిన తులసి.

ఎన్నో భాషల్లో ఎన్నో చిత్రాలలో నటించిన ఈ సీనియర్ నటి తన మొట్టమొదటి సీరియల్ ప్రస్థానం జీ తెలుగు ఛానెల్ నుంచి మొదలు పెట్టనున్నట్టుగా వారు తెలుపుతున్నారు. మరి ఈమె ఈ ఛానెల్లో కేవలం గెస్ట్ గానే కనిపిస్తారా లేక కంటిన్యూ అవుతారా అన్నది చూడాలి.