అసలు ఆర్జీవీ కోసం వచ్చింది పవన్ ఫ్యాన్సే కాదట.!

Friday, July 24th, 2020, 08:02:09 AM IST

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక సంచలన హాట్ టాపిక్ అయ్యిపోయాడు. తనకు ఎంతైతే అటెన్షన్ కావాలి అనుకున్నాడో అంతకు మించిన అటెన్షన్ నే తెచ్చుకున్నాడు.

పవన్ ఫ్యాన్స్ ని కెలికితే ఎలా ఉంటుందో ఇది వరకే తెలిసిన వర్మ దాని ప్రభావం కోసం కూడా చాలా సార్లు చెప్పాడు. కానీ ఇది వరకు ఇతరులకు సలహా ఇచ్చిన వర్మ ఈసారి తన మీదకే తెచ్చుకున్నాడు. కేవలం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ “పవర్ స్టార్” అనే టైటిల్ తో సినిమా తీసి పవన్ కళ్యాణ్ మీద సినిమా తీసి కూడా నేను తీసింది పవన్ మీద కాదు అని చెప్తున్నాడు.

అసలు నిజం అతనికి తెలిసి కూడా అలా మాట్లాడుతున్నాడని అందరికీ తెలిసిందే. మొదటి నుంచి ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ ఎంత శాంతంగా ఉందామనుకున్నా వారికి ఛాలెంజ్ లు మీద ఛాలెంజ్ లు విసురుతూనే ఉన్నాడు. దీనితో వెర్రెక్కిపోయిన కొంతమంది వర్మ పిలిచినట్టుగానే అతని ఇంటికి వెళ్లిపోయారు. అది పెద్ద రచ్చే లేచింది.

దీనితో ఇప్పుడు అసలు ఆ వెళ్ళింది పవన్ ఫ్యాన్సే కాదని అసలు పవన్ అభిమానులు అంటున్నారు. నువ్వు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సినిమా తీయనప్పుడు నిన్ను కొట్టడానికి వచ్చింది పవన్ ఫ్యాన్స్ ఎలా అవుతారని లాజిక్ చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ వ్యవహారం మాత్రం మంచి రంజుగా తయారయ్యింది అని చెప్పాలి.