పవన్ కళ్యాణ్ తో డిసైడ్ అయిపోయిందిగా..!!

Saturday, September 30th, 2017, 03:53:01 PM IST

ప్రస్తుతం సంక్రాంతి బరిలో ఉన్న రెండే. ఒకటి పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల చిత్రం కాగా, రెండవది బాలకృష్ణ, కె ఎస్ రవికుమార్ ల చిత్రం. మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రాన్ని మొదట సంక్రాంతికి విడుదల చేయాలనీ భావించారు. కానీ ఆ చిత్రం వేసవి సేవలవుల్ని టార్గెట్ చేసింది. చెర్రీ రంగస్థలం విషయంలో కూడా డైలమా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పవన్, బాలయ్య వంటి స్టార్ లతో పోటీ పడడానికి దేవసేన డిసైడ్ అయిపోయింది. అనుష్క ప్రస్తుతం చారిత్రాత్మక చిత్రం భాగమతిలో నటిస్తోంది.

పిల్ల జమిందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరెకెక్కుతోంది. యువి క్రియేషన్స్ వారు నిర్మాతలు. సంక్రాంతికి రెండు మూడు పెద్ద సినిమాలు విడుదలైనా ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీనితో పవన్, బాలయ్య చిత్రాలు ఉన్నా భాగమతిని విడుదల చేసినందుకు నిర్మాతలు సాహసిస్తున్నారు. ఇద్దరు బడా హీరోలతో అనుష్క పోటీపడుతుండడంతో సంక్రాంతి రేసు రంజుగా తయారైంది.

Comments