టాప్ స్టోరి: క్రిస్మ‌స్ రేస్‌లో బిగ్ ఫైట్‌

Monday, October 22nd, 2018, 11:39:32 PM IST

ద‌స‌రా, సంక్రాంతి త‌ర్వాత క్రిస్మ‌స్ పండ‌గ‌కు ప్రాధాన్య‌త ఉంది. పైగా క్రిస్మ‌స్‌కి స్కూళ్లు, కాలేజ్‌ల‌కు సెల‌వులు త‌ప్ప‌నిస‌రి. అందుకే ఈ పండ‌గ‌కు కూడా రిలీజ్‌లు ప్లాన్ చేస్తుంటారు. ఈసారి క్రిస్మ‌స్ (డిసెంబ‌ర్)కి ఓ మూడు సినిమాలు అత్యంత క్రేజీగా రిలీజ‌వుతున్నాయి.

శ‌ర్వానంద్ – సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన `ప‌డిప‌డి లేచే మ‌నసు`, వ‌రుణ్‌తేజ్ – సంక‌ల్ప్‌రెడ్డి కాంబినేష‌న్ మూవీ `అంత‌రిక్షం 9000 కెఎంపిహెచ్`, మ‌మ్ముట్టి- మ‌హి.వి రాఘవ్ కాంబినేష‌న్ మూవీ `యాత్ర‌` చిత్రాలు క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 21న రిలీజ‌వుతున్నాయి. ఇవి మూడూ డిఫ‌రెంట్ కాన్సెప్టుల‌తో తెర‌కెక్కిన‌వే. శ‌ర్వా పూర్తి స్థాయి రొమాంటిక్ ల‌వ్‌స్టోరిలో న‌టిస్తున్నాడు. వ‌రుణ్ తేజ్ ఏకంగా టాలీవుడ్‌లో ఇదివ‌ర‌కెన్న‌డూ ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని క‌థాంశాన్ని ఎంచుకుని స్పేస్ బ్యాక్‌డ్రాప్ మూవీతో సంచ‌ల‌నానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. అలాగే వైయ‌స్సార్ జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కుతున్న యాత్ర అంతే ప్ర‌త్యేక‌మైన చిత్రంగా పాపుల‌రైంది. ఈ మూడు వేటిక‌వే ప్ర‌త్యేకం కాబ‌ట్టి క్రిస్మ‌స్ బ‌రిలో కాంపిటీష‌న్ ఠ‌ఫ్‌గానే ఉంటుంద‌ని భావిస్తున్నారు. కొత్త సంవ‌త్స‌రంలో అడుగుపెట్టే ముందే ఈ మూడు సినిమాల బాక్సాఫీస్ ఫైట్ చ‌ర్చ‌కు రానుంది. మారిన ట్రెండ్‌లో క‌థ‌, కంటెంట్ బావుంటే ఈ సినిమాల‌కు జ‌నం ప‌ట్టంగ‌డ‌తార‌నే అంతా భావిస్తున్నారు. ఇక ఈ దీపావ‌ళికి రిలీజ్‌కి వ‌స్తున్న ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ `స‌ర్కార్`, న‌వంబ‌ర్ 29న వ‌స్తున్న `2.ఓ` స్పెష‌ల్ కంటెంట్‌తో స్పెష‌ల్‌ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments