హాట్ టాపిక్: మెగాస్టార్ సినిమాకి నో… రవితేజ కి యస్!?

Sunday, March 22nd, 2020, 11:02:40 PM IST

మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం అయిన ఆచార్య చిత్రంలో హీరోయిన్ గా అవకాశం రాగా, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా సినిమా నుండి వైదొలగింది త్రిష. అయితే ఆచార్య చిత్రం నుండి తప్పుకున్న త్రిష, రవితేజ సినిమా కు ఓకే చెప్పినట్లు సమాచారం. రవితేజ వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు. క్రాక్ చిత్రం అనంతరం రమేష్ వర్మ తో ఒక సినిమా చేయనున్నాడు రవితేజ. అయితే ఈ సినిమా లో హీరోయిన్ గా త్రిష నీ సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయం లో త్రిష డేట్స్ ఇవ్వడమే ఆలస్యం అని తెలుస్తుంది. ఇటీవల కాలంలో లేడీ ఓరయెంటెడ్ సినిమాలు చేస్తున్న త్రిష ఈ చిత్రానికి ఒప్పుకోవడం పట్ల మెగా అభిమానులు కాస్తా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.