బాహుబలిని చూసి చేతులు కాల్చుకున్న..థగ్స్..?

Thursday, November 8th, 2018, 08:53:04 PM IST

దర్శకుడు రాజమౌళి మరియు హీరో ప్రభాస్ ల యొక్క ఐదేళ్ల సుదీర్ఘమైన కష్టానికి ప్రతిఫలం “బాహుబలి” రెండు చిత్రాలు.భారతీయ సినీ ఇండస్ట్రీలోనే ఈ రెండు చిత్రాలు సృష్టించిన భీబత్సం అంతా ఇంతా కాదు యావత్తు ప్రపంచాన్నే తెలుగు పరిశ్రమ వైపు తిరిగి చూసేలా ఈ రెండు చిత్రాలు చేశాయి.అప్పటికే భారత దేశం అంతటా వసూళ్ల విషయంలో ఒక్క బాలీవుడ్ చిత్రాలదే పై చేయి ఉండేది ఎప్పుడైతే ఈ చిత్రాలు బాక్సాఫీస్ మీద దాడి చేశాయో ఒక్క సారిగా ఆ లెక్కలన్నీ మారిపోయాయి.ఇప్పుడు మన బాహుబలి సెట్ చేసిన రికార్డులను అందుకోడానికి మిగతా ఇండస్ట్రీ సినిమాలు అన్ని ప్రయత్నిస్తున్నాయి,అయితే బాహుబలి మొదటి భాగం వచ్చిన తర్వాత ఈ చిత్రానికి మించి మా చిత్రం ఉంది అందులో అన్ని ఫ్రేమ్స్ వాడితే మేము ఇన్ని ఫ్రేమ్స్ వాడాము అని చెప్పుకుని వచ్చిన అగ్ర తారల యొక్క సినిమాలు అన్ని ఊహించని స్థాయిలో ఘోర పరాజయాలుగా మిగిలిపోయాయి.

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు చాలా సినిమాలే బాహుబలిని కొట్టేద్దామని వచ్చి వెళ్లిపోయాయి.ఇప్పుడు కూడా అదే జాబితాలోకి మరో సినిమా వెళ్లబోతుందా అంటే అవుననే అంటున్నారు సినీ ప్రేమికులు.ఇటీవలే విడుదల అయినటువంటి బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమా “థగ్స్ ఆఫ్ హిందుస్థాన్” ఈ చిత్రం కూడా భారీ తారాగణంతో భారీ గ్రాఫికల్ విజువల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రం టార్గెట్ మాత్రం బాహుబలి 2.అయితే ఈ చిత్రాన్ని చూసాక సినీ అభిమానులు పెదవి విరుస్తున్నారు.బాహుబలి చిత్రాన్ని కొట్టడానికి అందరు శత విధాలా ప్రయత్నిస్తున్నారు కానీ మీ వల్ల అవి అయ్యే పనులు కావని కామెంట్లు విసురుతున్నారు.బాహుబలిని చూసి చేతులు కాల్చుకున్న మరో చిత్రంగా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మిగిలిపోతుంది అని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.