థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్ మూవీ టాక్.. దీపావ‌ళికి ఫిరంగి పేలిందా..?

Thursday, November 8th, 2018, 12:32:15 PM IST

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ న‌టించిన తాజా చిత్రం థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ ఈ రోజే దీపావ‌ళి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రంలో తొలిసారి అమితాబ్ బ‌చ్చ‌న్, ఆమిర్‌ఖాన్‌లు క‌లిసి న‌టించారు. బాలీవుడ్ ప్ర‌ముఖ రచ‌యిత‌, ద‌ర్శ‌కుడు విజ‌య్‌ కృష్ణ ఆచార్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో క‌త్రిన కైఫ్, దంగ‌ల్ ఫేమ్ ఫాతిమాలు కీలకపాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇక ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావ‌డంతో థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు పెరిగిపోయాయి. దీంతో ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన‌ థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ అయ్యాయి. దీంతో ఈ సినిమా చూసిన అభిమానులు ట్విట్ట‌ర్ ద్వారా త‌మ అభిప్రాయాన్నితెలియ జేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ బాలీవుడ్ క్రిటిక్ త‌రుణ్ ఆద‌ర్శ్ ఈ సినిమా పై చేసిన ట్వీట్ సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

తాజాగా ఈ చిత్రం పై ట్విట్టర్ ద్వారా త‌న అభిప్రాయాన్ని తెలుపుతూ.. స్టార్ కాస్ట్, బిగ్ బ‌డ్జెట్, భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ డిజ‌ప్పాయింట్ చేసంద‌ని.. స్కీన్ ప్లే చాలా వీక్‌గా ఉంద‌ని.. మొద‌టి గంట‌లో కొన్ని లీన‌మ‌య్యే సీన్లు త‌ప్పా.. ఆధ్యంతం థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ నిరాశ‌ప‌ర్చింద‌ని.. దీంతో దీపావ‌లి శెల‌వుల్ని క్యాష్ చేసుకునే మంచి అవ‌కాశాన్ని థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ మిస్ అయ్యిందని త‌రుణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు. ఇక మ‌రో వ్య‌క్తి ట్వీట్ చేస్తూ.. థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్‌ని చూడాలంటే డ్ర‌గ్స్ తీసుకొని వెళ్ళాల‌ని ట్వీట్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments