టిక్కెట్లు అమ్మేస్తున్న థ‌గ్స్ టిక్కెట్లు అమ్మేస్తున్న థ‌గ్స్

Tuesday, October 30th, 2018, 09:38:10 AM IST

2018 మోస్ట్ అవైటెడ్ మూవీ `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్` న‌వంబ‌ర్ 8న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో తొలిసారి బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్, మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ క‌లిసి న‌టిస్తున్నారు. కత్రిన కైఫ్‌, పాతిమ స‌నా షేక్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. 17వ శ‌తాబ్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు భార‌త‌దేశానికి వ‌ర్త‌కం కోసం విచ్చేసి, ఇక్క‌డ రాజ్యాధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకుని, సంప‌ద‌ల్ని దోచుకుంటున్న‌ క్ర‌మంలో కొంద‌రు తిరుగుబాటు దారులైన థ‌గ్స్ విదేశీయుల‌పై ఎలా పోరాడారు? అన్న‌ క‌థ‌ను వెండితెర‌పైకి తెచ్చారు.

ఇదివ‌ర‌కూ హిందీ ట్రైల‌ర్‌తో పాటు, తెలుగు, త‌మిళ్ ట్రైల‌ర్ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేశారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేస్తున్నారు. అయితే `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌`కి తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌మోష‌న్ మాత్రం జీరో. ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. శ‌ర‌వేగంగా యూట్యూబ్‌లో వ్యూస్‌ని అందుకుంది. కానీ ఏం లాభం? అస‌లు ఇరు తెలుగు రాష్ట్రాల్లో మీడియా ప్ర‌మోష‌న్ లేనేలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. మ‌రో మూడు రోజుల్లో ఆన్‌లైన్‌లో `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్` టిక్కెట్ల అమ్మ‌కం ప్రారంభ‌మ‌వుతోంది. ఇండియా వ్యాప్తంగా బుకింగ్‌లు ఓపెన్ అవుతున్న‌ట్టేన‌ని తెలుస్తోంది. ఈ చిత్రానికి మ‌ల్టీప్లెక్సుల‌తో పాటు సింగిల్ థియేట‌ర్ల‌లోనూ ఆద‌ర‌ణ ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఏపీ, తెలంగాణ‌లో ఏ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు? అన్న‌ది తెలియాల్సి ఉందింకా. మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టించిన `ధూమ్ 3` తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోద‌గ్గ క‌లెక్ష‌న్స్ సాధించింది. అందుకే తాజాగా రిలీజ్‌కి వ‌స్తున్న `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌`పైనా కొంత‌మేర అంచ‌నాలేర్ప‌డ్డాయి.

  •  
  •  
  •  
  •  

Comments