ఇక్కడే “సాహో” రాబట్టాల్సింది చాలా ఉంది.!

Wednesday, September 18th, 2019, 04:47:29 PM IST

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన మరో తెలుగు సినిమాగా “సాహో” చరిత్ర పుటల్లో నిలిచింది.బాహుబలి తర్వాత మళ్ళీ ఒక్కసారిగా యావత్తు భారతదేశాన్ని తెలుగు సినిమా వైపు టిఇరిగి చూసేలా ఈ చిత్రం చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ప్రభాస్ మరియు శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ కు వచ్చిన క్రేజ్ అనన్య సామాన్యం.

అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం అన్ని చోట్లా గట్టిగానే బిజినెస్ చేసి మొట్టమొదటి రోజునే రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది.అయితే ఈ చిత్రం పర్వాలేదనిపించినా బాహుబలి రేంజ్ లో థియేటర్ కు రెండు మూడు సార్లు జనాన్ని రాబట్టే క్రౌడ్ పుల్లర్ గా మాత్రం మారలేకపోయింది.దానికి తోడు బిజినెస్ కూడా ఎక్కువగా అవ్వడంతో సినిమా ఇప్పుడు ఆ మొత్తాన్ని రాబట్టడానికి ఈ చిత్రం గట్టిగానే కష్టపడుతుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

ఈ చిత్రం ఒక్క తెలంగాణ మరియు ఏపీలలో 120 కోట్లు బిజినెస్ చెయ్యగా ఇప్పటి వరకు 80 కోట్లు మాత్రమే రాబట్టినట్టుగా తెలుస్తుంది.అంటే ఇంకో 40 కోట్లు రావాల్సి ఉంది.కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాహో ఫుల్ రన్ లో అంత మొత్తాన్ని రాబట్టడం కష్టమే అని చెప్పాలి.ఇప్పటికే చాలా చోట్ల వసూళ్లు డల్ అయ్యిపోయాయి.ముఖ్యంగా నైజాం,సీడెడ్ ఉత్తరాంధ్రలలో సాహోకు భారీ నష్టాలు తప్పేలా లేవని ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే చెప్పక తప్పడం లేదు.మరి మొత్తానికి సాహో ఎక్కడ ఆగుతుందో చూడాలి.