మరోసారి “టైటానిక్” లో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండండి..!

Friday, October 26th, 2018, 08:32:28 PM IST

ప్రపంచంలో “టైటానిక్” అనే పేరు వినని సినీ అభిమాని ఉండి ఉండడు.మరీ ముఖ్యంగా అయితే ప్రేమికులకు ఈ చిత్రం అంటే అమితమైన ఇష్టం.తన చిత్రాలతో మనల్ని వేరే ప్రపంచానికి తీసుకెళ్లిపోయే అద్భుత చిత్రాల సృష్టికర్త జేమ్స్ కామెరూన్ స్వీయ దర్శకత్వం,నిర్మాణంలో లియోనార్డో డికాప్రియో మరియు కేట్ విన్ స్లెట్ హీరో హీరోయిన్లుగా 1997 వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ అన్ని చిత్రాల్లో ఒక అద్భుతం.

ఈ చిత్రం యొక్క ప్రభంజనంకి ఉదాహరణగా చెప్పాలి అంటే ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ సినిమాగా రికార్డుల్లో ఉంది.అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు తాజా వార్త ఒకటి బయటకి వచ్చింది,ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపు పార్ట్ 2 ని సిద్ధం చేస్తున్నట్టుగా ఇప్పుడు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోయే క్లైవ్ పామర్ తెలిపారు.ఈ చిత్రాన్ని 2022 లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటుగా తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments