మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు నేడు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న వార్నర్..!

Saturday, May 30th, 2020, 01:38:52 AM IST

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మైదానంలోనే కాదు గత కొద్ది రోజులుగా టాలీవుడ్ పాటలకు, డైలాగ్‌లకు వరుస పెట్టి టిక్‌టాక్ వీడియోలు చేస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.

మొదట అలవైకుంఠపురంలోని బుట్ట బొమ్మ, రాములో రాములో సాంగ్‌లకు తన సతీమణితో కలిసి డ్యాన్స్ చేసిన వార్నర్ ఆ తరువాత మహేష్, ప్రభాస్ డైలాగ్‌లకు కూడా వీడియోలు చేశాడు. అయితే మహేశ్ బాబు ఫ్యాన్స్ సరిలేరు నీకెవ్వరులోని మాస్ బీట్ మైండ్‌బ్లాక్ సాంగ్‌కి వీడియో చెయ్యమని అడగగా దానికి డేవిడ్ వార్నర్ రెడీ అయిపోయాడు. మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌కు టిక్‌టాక్‌ అని చెప్పకుండా రేపు సర్‌ప్రైజ్‌ అంటూ ఆ పాటకు సంబంధించిన స్టెప్పులతో చిన్న హింట్‌ ఇస్తూ నిన్న ఓ వీడియో చేశాడు. అయితే మహేశ్ మాస్ బీట్ పాటకు వార్నర్ ఎలా స్టెప్స్ వేస్తాడనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.