టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్.. రివ‌ర్స్ అయిన అనసూయ..!

Friday, October 12th, 2018, 11:58:29 AM IST

దేశంలో అతిపెద్ద‌ చిత్ర ప‌రిశ్ర‌మ అయిన బాలీవుడ్‌లో త‌న‌కు ఎదురైన లైంగిక వేధింపుల పై సోష‌ల్ మీడియాలో స్పందించి ఒక్క‌సారిగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది త‌నుశ్రీ ద‌త్తా. దీంతో సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌మ‌కు ఎదురు అవుతున్న లైంగిక వేధింపుల పై అనేక‌మంది హీరోయిన్లు బ‌య‌ట‌కు వ‌చ్చి మీడియా ముందు బ‌హిరంగంగా స్పందిస్తూ.. కాస్టింగ్ కౌచ్ పై యుద్ధం ప్ర‌క‌టించారు హాట్ భామ‌లు.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే టాలీవుడ్‌లో అయితే ఈ కాస్టింగ్ కౌచ్ ఇష్యూ పై కొంత కాలం క్రితం శ్రీరెడ్డి రచ్చ ర‌చ్చ చేసి ఆ త‌ర్వాత కామ్ అయిపోయింది. ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో క‌ల్లా టాలీవుడ్‌లోనే ఎక్కువ‌గా కాస్టింగ్ కౌచ్ ఉంటుంద‌ని చాలామంది ఆరోపిస్తున్న నేప‌ధ్యంలో.. తాజాగా బుల్లితెర హాట్ యాంకర్ అనుసూయ చేసిన వ్యాఖ్య‌లు సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళ‌ల‌పై పెద్ద‌గా లైంగిక వేధింపులు ఉండ‌వని.. ఇక్క‌డ చాలా మంది మంచి వారు ఉన్నార‌ని.. కావున తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు కొత్త‌గా వచ్చే అమ్మాయిలు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పి అనసూయ ఒక్క‌సారిగా వార్త‌ల్లోకి ఎక్కింది. దీంతో దేశ వ్యాప్పంగా లైంగిక వేధింపులకు వ్య‌తిరేకంగా మీటూ ఉధ్య‌మం ఉదృతం అవుతున్న నేప‌ధ్యంలో అన‌సూయ చేసిన కామెంట్ సినీ వ‌ర్గాల్లో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాయి.