కరోనా పై ఫైట్: రీల్ హీరోలు మాత్రమే కాదు, వీరు రియల్ హీరోలు కూడా!

Thursday, March 26th, 2020, 06:45:20 PM IST


కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పట్టి పీడిస్తుంది. అయితే దీని నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కష్టపడుతున్నారు. అయితే ఈ పోరాటంలో ప్రభుత్వానికి అండగా ప్రముఖ టాలీవుడ్ హీరోలు సైతం తమకు తోచిన విరాళాన్ని ప్రకటించారు. ఈ మహమ్మారిని అడ్డుకోవడానికి 21 రోజుల లాక్ డౌన్ అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పిలుపు ఇచ్చారు. అయితే ఈ నేపధ్యంలో ప్రజలు పలు రకాల ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం పలు రకాల చర్యలు చేపట్టింది.

ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, మరియు ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు ప్రముఖులు సహాయం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీ సహాయ నిధికి, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. అలానే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోటి రూపాయలు విరాళం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించారు. అయితే చిరంజీవి కోటి రూపాయలు సినీ కార్మికులకు విరాళం ప్రకటించారు. రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ, పలువురు యువ హీరో లు విరాళం ప్రకటించారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోటి విరాళం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించారు. త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు లు సైతం విరాళం ప్రకటించారు.