హరీష్ శంకర్ కి తోడుగా టాలీవుడ్ జనాలు

Friday, September 20th, 2019, 05:58:19 PM IST

మరికొద్ది గంటల్లో సినిమా విడుదల అవుతుందని అనుకుంటున్నా సమయంలో అనుకోని విధంగా సినిమా పేరు మార్చాలని ఆదేశాలు వస్తే ఏ దర్శకుడైన మానసికంగా కృంగిపోతాడు. సినిమాకి టైటిల్ అనేది ఎంత పెద్ద బలం అనేది అందరికి తెలుసు. ప్రేక్షకుల్ని సినిమా హాల్ వైపు నడిపించేది టైటిల్. వాల్మీకి విషయంలో జరిగిన సంఘటన చూస్తే సినిమా గురించి కొంచమైనా పరిజ్ఙానం ఉన్నవాళ్ళందరూ అయ్యో పాపం అనకుండా ఉండలేరు.

వాల్మీకి సినిమాకి ముందు రోజు టైటిల్ మార్చాలని చెప్పటంతో “గద్దలకొండ గణేష్” గా మార్చారు. దీనిపై హరీష్ శంకర్ బాధపడుతూ నేను ఓడిపోయాను అంటూ తన ఆవేదనని బయటపెట్టాడు. ఒక డైరెక్టర్ గా కాకుండా ఒక హైందవ సమాజానికి చెందిన వ్యక్తిగా వాల్మీకి మహర్షి మీద ఒక గౌరవాన్ని ఒక మంచి విషయాన్నీ ముందుకి తీసుకోని వెళ్లలేకపోయానని బాధగా ఉందంటూ విచారం వ్యక్తం చేశాడు.

దీనిపై టాలీవుడ్ నుండి హరీష్ శంకర్ కి మద్దతుగా చాలా మంది ప్రముఖులు సపోర్ట్ గా నిలిచారు. విజయ్ దేవరకొండ, వంశి పైడిపల్లి, రాహుల్ రవీంద్రన్,బాబీ లాంటి వాళ్ళు హరీష్ శంకర్ కి సపోర్ట్ గా మాట్లాడుతూ సినిమా విడుదలకి కొన్ని గంటల ముందు ఇలా పేరు మార్చటం అనేది చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. బాధపడకు హరీష్ నువ్వు ఓడిపోలేదు. నీకు సినిమా మీద ఉన్న ఇష్టం మాకు తెలుసు..నీకు మద్దతుగా మేము ఉన్నామంటూ మాట్లాడారు.