ధోనీకి నీరాజనం పడుతున్న సెలెబ్రెటీలు.!

Friday, June 7th, 2019, 03:36:50 PM IST

భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకు ఇప్పుడు యావత్తు భారతదేశం నీరాజనం పడుతుంది.తాజాగా దక్షిణాఫ్రికా తో జరిగిన ప్రపంచ కప్ మొదటి మ్యాచ్ లోని ధోని కీపింగ్ చేసినపుడు అతని గ్లౌస్ మీద ఉన్న ఒక గుర్తు ప్రతీ ఒక్కరిని ఆకర్షితులను చేసింది.భారత రక్షక దళాలకు సంబంధించిన “బలిదాన్” అనే గుర్తు కలిగి ఉన్న గ్లౌస్ ను ధోని వేసుకొని తన దేశ భక్తిని చాటితే దానికి క్రికెట్ బోర్డు ఐసీసీ వారు ఆంక్షలు విధించారు.ధోని తర్వాత మ్యాచ్ లో ఆ గుర్తు ఉన్న గ్లౌస్ వేసుకోడానికి వీలు లేదని వాటితో ఆడరాదని కాస్త ఓవర్ యాక్షన్ చేయగా ధోనికి అండగా ఇప్పుడు యావత్తు భారతదేశం నిలబడుతుంది.

ధోని ఆ గ్లౌస్ తోనే ఆడుతాడని ధోని ఆ గ్లౌసులు తియ్యకూడదని ట్విట్టర్ లో ప్రతీ “ధోని కీప్ ది గ్లోవ్” అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు.దీనికి గాను మన తెలుగు హీరోల్లో కూడా మద్దతు ప్రకటిస్తున్నారు.ఇప్పటికే సుధీర్ బాబు కూడా తన అభిప్రాయాన్ని తెలుపగా తాజాగా సాయి ధరమ్ తేజ్ ఐసీసీ బోర్డు వారికి చురకలు అంటించే విధంగా ఓ ట్వీట్ చేసారు.నిన్న విండీస్ మరియు ఆసీస్ కు మధ్య జరిగిన మ్యాచ్ లో అంపైర్ల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపించింది.దీనిపై కూడా మన వాళ్ళు చాలా మండి పడ్డారు.సాయి ధరమ్ తేజ్ కూడా ధోని గ్లౌస్ ల మీద పెట్టిన శ్రద్ధ ఐసీసీ వారు అంపైర్ల మీద కూడా కాస్త పెడితే బాగుంటుంది అని వ్యంగ్యంగా ట్వీట్ పెట్టి “ధోని కీప్ ది గ్లోవ్” హ్యాష్ ట్యాగ్ తో తాను కూడా ధోనికి మద్దతుగా నిలిచారు.