టాలీవుడ్ కింగ్‌కి 59, బాలీవుడ్‌ కింగ్‌కి 53

Friday, November 2nd, 2018, 02:59:20 PM IST

రాజ్యాలు పోయి రాచ‌రికం అంత‌మైనా ఇంకా కింగ్స్ మాత్రం అంత‌రించ‌లేదు. స్టారాధిస్టార్లుగా స‌త్తా చాటుతూ ఎదురేలేని కింగ్స్ గా అభిమానుల గుండెల్లో నిలిచే ఉన్నారు వీళ్లు. సినీసామ్రాజ్యాల్ని, హృద‌య సామ్రాజ్యాల్ని గెలుచుకుంటూ ఈ ఇద్ద‌రు కింగ్స్ వెరీ స్పెష‌ల్ అని ప్రూవ్ చేశారు. అందులో ఒక‌రు మ‌న కింగ్ నాగార్జున అయితే, ఇంకొక కింగ్ షారూక్ ఖాన్. ఈ ఇద్ద‌రికీ కామ‌న్‌గా కొన్ని పోలిక‌లు ఉన్నాయి. ఇద్ద‌రు కింగ్‌లు రొమాంటిక్ హీరోలే… ఇద్ద‌రి మ‌ధ్యా చాలా విష‌యాల్లో సారూప్య‌త ఉంది. ఇరువురూ జియాంట్ ఎంట‌ర్‌ప్రెన్యూర్స్.. హీరోలుగా, నిర్మాత‌లుగా, ఇత‌ర‌త్రా బిజినెస్ రంగాల్లోనూ స‌త్తా చాటిన ధీరులు ఇద్ద‌రూ.

బిలియ‌న్ డాల‌ర్ వ్యాపార సామ్రాజ్యాల‌కు అధిపతులు. అయితే ఆ ఇద్ద‌రి లో నాగార్జున ఏఎన్నార్‌ న‌ట‌వార‌సుడిగా తెరంగేట్రం చేసి అటుపై హార్డ్‌వ‌ర్క్‌తో ఇంతింతై అన్న చందంగా ఎదిగితే, కింగ్ ఖాన్ మాత్రం ఎలాంటి వార‌స‌త్వం లేకుండా ఒక మామూలు కుర్రాడిగా బాలీవుడ్‌లో ప్ర‌వేశించి నేడు సువిశాల ప్ర‌పంచాన్ని ఏల్తున్నాడు. రెడ్ చిల్లీస్ పేరుతో ఎదురేలేని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రించి బాల‌వుడ్‌లో ఆట ఆడుతున్నాడు. ఆ ఇద్ద‌రు కింగ్స్ ఫోర్బ్స్ జాబితాలో చేరిన అల్ట్రా రిచ్ బిజినెస్‌మేన్స్ కూడా.

ఇంత‌కీ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా వ‌య‌సు ప‌రంగా గ్యాప్ ఎంత‌? అంటే జ‌స్ట్ ఐదేళ్లు మాత్ర‌మే. కింగ్ నాగార్జున వ‌య‌సు 59. కింగ్‌ఖాన్ షారూక్ వ‌య‌సు 53. నాగ్ కంటే ఆరేళ్లు చిన్న‌వాడు బాలీవుడ్ బాద్ షా. ఇంకా చెప్పాలంటే మ‌న‌ బాల‌య్య(58) కంటే జ‌స్ట్ ఐదేళ్లే చిన్న‌వాడు. మెగాస్టార్ చిరంజీవి (63) కంటే 10ఏళ్లు చిన్న వ‌య‌సు. నేడు ఇండియా గ‌ర్వించే, త‌లెత్తుకునే స్టారాధిస్టార్‌గా చ‌క్రం తిప్పుతున్నాడు షారూక్. అత‌డి బ‌ర్త్ డే సంద‌ర్భంగా నేటి మ‌ధ్యాహ్నం జీరో కొత్త టీజ‌ర్ రిలీజ‌వుతోంది. నిన్న రిలీజైన జీరో మూవీ కొత్త పోస్ట‌ర్లు ఆస‌క్తి రేకెత్తించాయి. తాజాగా షారూక్‌కి బ‌ర్త్ డే విషెస్ చెబుతూ ద‌ర్శ‌కుడు ఆనంద్ .ఎల్‌.రాయ్ ఓ ఫ‌న్నీ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు. ఇందులో షారూక్ మెడ‌లో క‌రెన్సీ నోట్ల దండ క్యా సీన్ హై! అన్న చందంగా ఉంది. దిగ్గ‌జాలు.. స‌చిన్ టెండూల్క‌ర్, అంబానీస్, అమీర్ ఖాన్, స‌ల్మాన్ నుంచి షారూక్‌కి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. నేడు ఖాన్‌ల త్ర‌యంలోని ఇత‌ర ఖాన్‌లైన‌ అమీర్, స‌ల్మాన్ .. షారూక్‌కి స్పెష‌ల్ పార్టీ ఇస్తున్నార‌న్న స‌మాచారం ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments