ఆ నిర్మాతను అరెస్ట్ చేసిన పోలీసులు ?

Tuesday, September 20th, 2016, 01:37:46 PM IST

MVV-Satyanarayana
ఒకప్పుడు నిర్మాత అంటే .. కేవలం సినిమాలు తీయాలనే ఉద్దేశమే ఉండేది. ఒక సినిమా అయిపొయింది .. ఆ తరువాత సినిమా ఏమిటనే విషయాలపైనే వారి ఫోకస్ ఉండేది, ఇక ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ భూమ్ వచ్చిందో .. అప్పటినుండి తెలుగు పరిశ్రమలోకి కొత్త కొత్త నిర్మాతలు వచ్చేస్తున్నారు. సినిమా అందరికి ఆసక్తే కాబట్టి .. కనీసం ఒక్క సినిమా అయినా చేయాలనే కోరికతో ఇక్కడికి వస్తున్నారు. ఇక వారు ఇతర బిజినెస్ లతో కూడా బిజీగా ఉన్నారు కాబట్టి దారుణాలు కూడా ఎక్కువయ్యాయి !! తాజాగా ‘గీతాంజలి’ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన ఎంవివి సత్యనారాయణను విశాఖలో పోలీసులు అరెస్ట్ చేసారట. సత్యనారాయణ ప్రస్తుతం మంచు విష్ణుతో లాక్కున్నోడు చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సత్యనారాయణ భూ ఆక్రమణకు పాల్పడ్డారన్న ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వైజాగ్ లో ఓ గృహ నిర్మాణ ప్రజెక్టు ను మొదలు పెట్టాడని, ఈ క్రమంలో లే అవుట్ లో ఉన్న ఇతరుల భూముల్ని కూడా ఆక్రమించి రోడ్డు నిర్మించారని అయన పై పిర్యాదు ఉంది. అయన పై ఈ విషయమై ఓ వ్యక్తి పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసారు. గతంలో కూడా అయన పై ఇలాంటి భూ వివాదాలు ఉన్నాయని తెలిసింది. ఇక సత్యనారాయణ, కోన వెంకట్ తో కలిసి నిర్మిస్తున్న ‘అభినేత్రి’ సినిమా త్వరలో విడుదల కానుంది.