అమెరికాలో టాప్ -5 టాలీవుడ్ మూవీస్‌

Monday, April 23rd, 2018, 11:05:57 PM IST


అమెరికా మ‌రో నైజాంగా కాసుల వ‌ర్షం కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి సిరీస్ త‌ర‌వాత మారిన ట్రెండ్ ఇది. ఇటీవ‌లి కాలంలో క్రేజీ సినిమాల‌న్నీ సునాయాసంగా మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌లో చేరుతున్నాయి. రీసెంటుగా రిలీజైన రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను చిత్రాలు కేవ‌లం రెండు మూడు రోజుల్లోనే 2.5 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. అయితే ఇప్ప‌టికి అమెరికా బాక్సాఫీస్ వ‌ద్ద టాప్ -5 గ్రాస‌ర్స్‌గా నిలిచిన తెలుగు సినిమాలేవి? అంటే.. ఇవిగో ఐదు సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి.

`బాహుబ‌లి-2`, `బాహుబ‌లి-1` తొలి రెండు స్థానాల్లో రికార్డుల్ని అలానే ప‌దిలం చేసుకున్నాయి. ఆ త‌ర‌వాత రామ్‌చ‌ర‌ణ్ `రంగ‌స్థ‌లం` మూడో స్థానం ద‌క్కించుకుంది. ఈ రికార్డును తుడిచేసే సినిమా ఎప్పుడొస్తుందో అనుకుంటుండ‌గానే, మొన్న రిలీజైన `భ‌ర‌త్ అనే నేను` అన్ని రికార్డుల్ని స‌వ‌రిస్తూ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. ఈ చిత్రం అమెరికా బాక్సాఫీస్ వ‌ద్ద కేవ‌లం రెండ్రోజుల్లో 2.5 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసి టాప్ 4 స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకును ఫుల్ ర‌న్‌లో మ‌రింత మెరుగుప‌రుచుకుంటుంద‌నే భావిస్తున్నారు. అటుపై టాప్ -5 పొజిష‌న్‌లో రెండు సినిమాలు ఉన్నాయి. ఒక‌టి మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `ఖైదీ నంబ‌ర్ 150`, నితిన్ న‌టించిన `అ..ఆ` చిత్రాలు 2.5 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల‌తో ఆ స్థానం ద‌క్కించుకున్నాయి. 2.5 మిలియ‌న్ డాల‌ర్లు అంటే త‌క్కువేమీ కాదు. దాదాపు 17 కోట్ల రెవెన్యూ. 3.5 మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ లో అడుగుపెడితే 25కోట్లు వ‌సూలు చేసిన‌ట్టే. అంటే ఒక్క నైజాం నుంచి క‌లెక్ట‌యినంత కేవ‌లం అమెరికా నుంచి వ‌సూలైన‌ట్టు!! వామ్మో ఇది ఊహాతీతం అనే చెప్పాలి.

  •  
  •  
  •  
  •  

Comments