ఇందిరా గాంధీ పాత్రలో త్రిష ?

Friday, October 26th, 2018, 12:58:47 PM IST

ఇందిరా గాంధీ బయోపిక్ లో త్రిష నటిస్తుందా?? వికటన్ అనే తమిళ మ్యాగ్జైన్ ప్రచురించిన ఈ డిజిటల్ పెయింటింగ్ ను పోలిన ఈ పోస్టర్ చూస్తుంటే నిజమేమో అన్న సందేహం వస్తుంది. ఇందిరా గాంధీ ట్రేడ్ మార్క్ అయిన షార్ట్ హైర్ స్టైల్, సాల్ట్ & పెప్పర్ లుక్ తో చీర కట్టు లో త్రిష అచ్చం ఇందిరా గాంధీ లాగే ఉంది. మరి ఆ మ్యాగజైన్ ఆ పోస్టర్ ఎందుకు ప్రచురించిందో తెలియదు గాని, సోషల్ మీడియా లో మాత్రం త్రిష ఇందిరా గాంధీ బయోపిక్ లో నటిస్తుంది అన్న వార్త వైరల్ అయ్యింది.

త్రిష నటిస్తున్న రజనీకాంత్ హీరో గా పెట్ట( తమిళ్ ), అరవింద స్వామి హీరో గా సతురంగా వెట్టై 2(తమిళ్ ) విజయ్ సేతుపతి సినిమా కాదు వాకుల రెండు కాదల్ (తమిళ్) వంటి చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. ఇకపోతే తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ కూడా నటిస్తోంది అన్న రూమర్లు చాల రోజుల నుండి వినిపిస్తున్న విషయం తెలిసిందే, నటి నిత్యా మీనన్ జయలలిత రోల్ లో కనిపించబోతుంది అన్న విషయం తెలిసిందే. కానీ త్రిష మాత్రం ఈ బయోపిక్ విషయం పై స్పందించలేదు.

  •  
  •  
  •  
  •  

Comments