పవన్ సరసన మరోసారి నటిస్తున్న త్రిష ?

Wednesday, November 16th, 2016, 11:35:31 PM IST

trisha-pawan-kalyan
అందాల భామ త్రిష .. ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టి .. కొన్సెప్టు ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ .. క్రేజ్ తెచ్చుకోవడానికి సిద్ధం అయింది. ఇప్పటికే ”మోహిని” చిత్రంలో నటిస్తున్న ఈ భామ సాధురంగా వెట్టై సినిమాలో నటిస్తుంది. ఇక లేటెస్ట్ గా త్రిష కు మరో బంపర్ అఫర్ దక్కింది ? ఇదేమిటో తెలుసా పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందట !! ఇప్పటికే ఈ అమ్మడు ”తీన్మార్” సినిమాలో పవన్ తో కలిసి నటించింది .. ఆ చిత్రం కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగా వర్కవుట్ అయింది. దాంతో ఇప్పుడు మళ్ళీ త్రిషను హీరోయిన్ గా తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ”కాటమరాయుడు” సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ .. ఈ సినిమా తరువాత నేసన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన ”వీరం” చిత్రానికి రీమేక్ గా రూపొందే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు నయనతార ను అనుకున్నారు? కానీ పవన్ నయనతారతో చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు, దాంతో ఇప్పుడు ఆ ప్లేస్ లోకి త్రిష వచ్చి చేరింది. ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మళ్ళీ పవన్ తో నటిస్తున్న త్రిష కు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి ?