జూనియ‌ర్ ఎన్టీఆర్ మాకు చుక్క‌లు చూపించాడు.. త్రివిక్ర‌మ్ షాకింగ్ కామెంట్స్…!

Tuesday, October 9th, 2018, 05:18:13 PM IST

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం అర‌వింద‌స‌మేత వీర‌రాఘ‌వ‌. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న‌ ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 11న విడుద‌ల కానుంది. భారీ తారాగ‌ణం, భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ చిత్రం విడుద‌ల అవుతుండ‌గా.. చిత్ర చూనిట్ ప్ర‌మోష‌న్లు కూడా భారీగానే చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఇంట‌ర్వ్యూ ఇచ్చిన త్రివిక్ర‌మ్.. తార‌క్ పై చేసిన వ్యాఖ్య‌లు సినీ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చ‌కే తెర‌లేపాయి.

అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. అరవింద స‌మేత చిత్రం షూటింగ్ స‌మ‌యంలో తార‌క్ త‌మ‌ను చాలా ఇబ్బంది పెట్టాడ‌ని.. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డాని చిత్ర యూనిట్ మొత్తం చాలా ఇబ్బందులు ప‌డ్డామ‌ని.. ఆ ఇబ్బంది ఏంటంటే.. షూటింగ్ ఉద‌యం ఏడు గంట‌ల‌కి పెట్టుకుంటే.. ఎన్టీఆర్ ఆరున్న‌ర‌కే సెట్‌లో ఉండేవార‌ని.. దీంతో ఎన్టీఆర్ కోసం యూనిట్ మొత్తం త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో అర‌గంట ముందే సెట్‌కు రావాల్సివ‌చ్చేద‌ని.. ఆ టైమ్‌లో ఎన్టీఆర్ మా అంద‌రికీ చుక్క‌లు చూపించాడ‌ని.. అయితే అదంతా స‌ర‌దాగా ఉండేద‌ని చెప్పారు త్రివిక్ర‌మ్.

ఇక అంతే కాకుండా మార్నింగ్ ఆరుగంట‌ల‌కి ఎలాంటి ఎన‌ర్జీ లెవ‌ల్స్‌తో షూటింగ్‌కి వ‌స్తాడో.. షూటింగ్ నుండి వెళ్ళేట‌ప్పుడ‌.. అది సాయంత్రం కావొచ్చు, అర్ధ‌రాత్రి కావొచ్చు,, అప్పుడు కూడా తార‌క్ అంతే ఎన‌ర్జీగా ఉండేవాడ‌ని.. అయితే అలా ఉండ‌డం ఎలా సాధ్య‌మో త‌న‌కు అర్ధం అయ్యేది కాద‌ని.. ఎన్టీఆర్ క్ర‌మ‌శిక్ష‌ణ వ‌ల్ల.. ముఖ్యంగా లాభ‌ప‌డేది నిర్మాత‌ల‌ని.. షూటింగ్ దాదాపు వంద‌రోజులు ప‌డుతుంద‌ని అనుకుంటే.. ఎన్టీఆర్ కార‌ణంగా అంత‌కంటే త‌క్క‌వ‌రోజుల్లోనే పూర్తి అయ్యింద‌ని..ఇలాంటి న‌టుడు ఉంటే ద‌ర్శ‌క, నిర్వాత‌లు చాలా ప్ర‌శాంతంగా త‌మ ప‌నులు చేసుకోవ‌చ్చ‌ని త్రివిక్ర‌మ్ అన్నారు. ఇకపోతే భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల అవుతున్న ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీసు వ‌ద్ద ఎలాంటి సంచ‌నాలు సృష్టిస్తుందో చూడాలి.