దర్శకులందు త్రివిక్రమ్ క్రేజ్ వేరయా..!

Tuesday, January 14th, 2020, 03:16:36 PM IST

మన తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలకు క్రేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.కానీ ఆ హీరోలను ప్రతీ ఒక్క సినిమాతో కొత్తగా వారిని చూపిస్తూ తెర వెనుక అసలు హీరోగా ఉండేది మాత్రం ఒక్క దర్శకుడే అని చెప్పాలి.అలా ఒక మాములు హీరోతో తీసినా సరే డైరెక్టర్ వల్ల కూడా థియేటర్లకు జనాలు వెళ్లే దిగ్గజ దర్శకులు కూడా మన టాలీవుడ్ లో ఉన్నారు.అలాంటి చాలా అతి తక్కువ మంది దర్శకుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు.

“ఆయన తెలిసిన తెలిసిన వాళ్ళు త్రివిక్రమ్ అని పిలుస్తారు.ఆయనేంటో తెలిసిన వారు గురూజీ అని పిలుచుకుంటారు.”అయితే మన టాలీవుడ్ లో త్రివిక్రమ్ కు అంటూ స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు.ఆయన స్పీచ్ ఇస్తే ఎంతటి వారు అయినా సరే అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.అలా ఆయన వాక్చాతుర్యం,డైలాగ్స్ అల్లరి చేసే యువతతో చప్పట్లు కొట్టిస్తాయి.అసలు ఏ సినిమాకు చెయ్యని విధంగా “అల వైకుంఠపురములో” లేటెస్ట్ పోస్టర్ ఒకటి ప్రూవ్ చేసింది.

కొంతమంది సెల్ఫ్ డబ్బా అంటారు సెల్ఫ్ ప్రమోషన్ అంటారు కానీ ఆ రేంజ్ అయితే ఇతర దర్శకులతో పోల్చితే త్రివిక్రమ్ అంటే ఇష్టపడే వాళ్ళు కూసింత ఎక్కువే ఉంటారు.దానికి నిదర్శనంగా ఇటీవలే అల వైకుంఠపురములో రిలీజ్ టైం బన్నీతో పాటుగా త్రివిక్రమ్ కటౌట్ కూడా పెట్టారు.ఇది మాత్రం ఏ దర్శకుడు అనుకోలేని ఫీట్ అని చెప్పాలి.