“అరవింద సమేత”లో త్రివిక్రమ్ చేసిన పెద్ద తప్పు అదే..!

Friday, October 12th, 2018, 12:25:12 PM IST

నిన్న భారీ అంచనాల నడుమ మాస్ ప్రేక్షకులకు మరియు ఎప్పటి నుంచో ఒక పెద్ద సినిమా రావాలని కోరుకుంటున్న తెలుగు సినీ ప్రేక్షకులకు మరియు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు కన్నుల పండుగలా దసరా ని “అరవింద సమేత” చిత్రంతో ముందుగానే నిన్న త్రివిక్రమ్ మరియు తారక్ లు అందించారు.ఈ చిత్రం మొదటి షో తోనే మంచి పాజిటివ్ టాక్ సంతరించుకోవడంతో ఇప్పుడు తారక్ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తున్నాడు.ఐతే ఇప్పుడు అంతా బాగున్నా త్రివిక్రమ్ మాత్రం ఒక తప్పును చేసాడని చెప్పాల్సొస్తుంది.

ఇప్పటికే ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లను కొల్లగొడుతుంది.చిత్రం విడుదలకు ముందు ఈ చిత్ర పాటలు ఎంత క్రేజ్ తెచ్చుకున్నాయి తెలిసిందే,వాటిలో “పెనివిటీ” పాటకి వచ్చిన స్పందన ఐతే వేరే అని చెప్పాలి.సాహిత్యం పరంగా చూసుకున్నా సంగీతం పరంగా చూసుకున్నా చాలా అద్భుతంగా భావోద్వేగ పూరితంగా ఉంటుంది కానీ చిత్రంలో చూస్తే మాత్రం విన్న పాటకి చూసిన పాటకి పూర్తి భిన్నంగా ఉండటంతో ఒక్క సారిగా ప్రేక్షకులు అంతా అవాక్కయ్యారు అనే చెప్పాలి.వినడానికి అంత అద్భుతంగా ఉన్నటువంటి పాట చూడ్డానికి మాత్రం అంత బాలేదని సగటు ప్రేక్షకుడితో పాటు తారక్ అభిమానులు కూడా ఒకింత నిరుత్సాహినికి గురయ్యారు.సినిమా అంతా అంత బాగా తీసిన త్రివిక్రమ్ ఈ ఒక్క పాట విషయంలో మాత్రం ఎందుకిలా చేశారు అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.