కోబలి విషయంలో పవన్ నిర్ణయం మారలేదన్నమాట ?

Tuesday, October 9th, 2018, 07:47:19 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ కోబలి అనే పక్కా రాయలసీమ ఫ్యాక్షన్ సినిమా చేస్తానని అప్పట్లో చెప్పాడు. దానికి సంబందించిన డిస్కషన్స్ కూడా వీరిద్దరి మధ్య జరిగాయి. ఆ సినిమాకు టైం పడుతుంది కాబట్టి .. ఈ లోగా అజ్ఞాతవాసి సినిమా తెరకెక్కించాడు త్రివిక్రమ్. ఆ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యాడు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తా అని మాత్రం చెప్పలేదు కాబట్టి అయన ఫాన్స్ కూసింత హోప్స్ తోనే ఉన్నారు. తాజాగా కోబలి సినిమా విషయంలో త్రివిక్రమ్ ఆసక్తికర విషయాలు తెలిపాడు. అయన తెరకెక్కించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఈ నెల 11న విడుదల కానున్న నేపథ్యంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు త్రివిక్రమ్. ఈ సందర్బంగా కోబలి సినిమా చర్చకు రాగా .. కోబలి సినిమాకు అరవింద సమేత కు ఎలాంటి పోలికలు లేవని , కోబలి పక్కా ఫ్యాక్షన్ నేపథ్యంలో ఎలాంటి పాటలు , ఎంటర్ టైన్ లేకుండా రా సినిమాగా ఉంటుందని .. అసలు ఫ్యాక్షన్ ను అందులో కనిపిస్తుందని చెప్పాడు. త్రివిక్రమ్ మాటలను బట్టి చుస్తే ఈ సినిమా ఎప్పటికైనా పవన్ తో తెరకెక్కించేలా కనిపిస్తున్నాడు. ఇక ఇప్పుడో స్క్రిప్ట్ నచ్చి ఓకే చెప్పిన పవన్ 2019 ఎన్నికల తరువాత మళ్ళీ సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నట్టు ఈ మధ్య వస్తున్న వార్తలను బట్టి తెలుస్తోంది. సో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ బహుశా .. త్రివిక్రమ్ తో కోబలి చేసిన చొయొచ్చు. మొత్తానికి ఈ విషయంతో పవన్ ఫాన్స్ లో కొత్త ఆశ చిగురించింది.