త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా .. ఆయనతోనేనా ?

Monday, October 22nd, 2018, 09:46:21 PM IST

అజ్ఞాతవాసి ఇచ్చిన ప్లాప్ నుండి బయటపడేసింది అరవింద సమేత. ఈ నెల 11 న విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డుల దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో మంచి ఉత్సాహంలో ఉన్న త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఎలా ఉంటుంది అన్న ఆసక్తి ఎక్కువైంది. ఇప్పటికే అల్లు అర్జున్ అయన కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు. అయితే నెక్స్ట్ సినిమా విషయంలో త్రివిక్రమ్ ట్రెండ్ మారినట్టుంది .. ఎందుకంటే అరవింద సమేత తరువాత వెంటనే మరో క్రేజీ హీరోతో సినిమా చేస్తే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి కాబట్టి .. దానికి రివర్స్ గా ఓ కూల్ సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు.

అందుకే అయన సీనియర్ హీరో వెంకటేష్ తో పక్కా ఫ్యామిలి ఎంటైర్ టైనర్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయి .. కానీ కథ మాత్రం ఫైనల్ కాలేదు .. సో త్రివిక్రమ్ నెక్స్ట్ వెంకటేష్ కోసం కథ అన్వేషణలో పడ్డాడు. గతంలో నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల తరహాలో ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం వెంకటేష్ వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 అనే మల్టి స్టారర్ చేస్తున్న విషయం తెలిసిందే. సో త్రివిక్రమ్ – వెంకటేష్ మ్యాజిక్ రిపీట్ అవ్వాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments