హాట్ టాపిక్: త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ హీరో నాగ చైతన్య?

Tuesday, February 18th, 2020, 04:13:23 PM IST

ఇప్పటివరకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పెద్ద పెద్ద సినిమాలే చేస్తూ వచ్చాడు. అ ఆ చిత్రం తో మధ్యలో సందడి చేసిన కమర్షియల్ హీరోలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు త్రివిక్రమ్. అయితే అలా వైకుంఠపురంలో చిత్రం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచినప్పటికీ తన తదుపరి చిత్రానికి హీరో అందుబాటులో లేరు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా ఆలోచనలో ఉన్నప్పటికీ ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ ఎక్కువ సమయం తీసుకొనే అవకాశం ఉంది.

అయితే ఎన్టీఆర్ కోసం వేచి చూసే బదులు ఈలోపు అఆ తరహా లో ఒక చిన్న సినిమా ని తెరకెక్కించి ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నాగ చైతన్య తో ఇప్పటివరకు త్రివిక్రమ్ సినిమా చేయలేదు. నాగ చైతన్య హీరోగా పెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక హాసిని క్రియేషన్స్ ఫై సినిమా ని తీసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే నాగ చైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీ చిత్రంలో నటిస్తున్నాడు. మరి ఈ చిత్ర అనంతరం త్రివిక్రమ్ తో నాగ చైతన్య సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందో రాదో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.