ఏంటి ఇది నిజమేనా..బన్నీ, మహేష్ లతో త్రివిక్రమ్..?

Tuesday, November 19th, 2019, 08:33:34 PM IST

ప్రస్తుతం రెండు పెద్ద హీరోల సినిమాలకు సంబంధించి వార్తలతో సోషల్ మీడియా హోరెత్తుతుండగా మరోపక్క సినీ వర్గాలు వేడెక్కుతున్నాయి.సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న “సరిలేరు నీకెవ్వరు” చిత్రం అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న “అల వైకుంఠపురములో” చిత్రం ఈ రెండు కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఒకే రోజున విడుదల కాబోతున్న సంగతి అందరికి తెలిసిందే.

ఇప్పటికే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి అని అనేక వార్తలు వినిపిస్తున్న తరుణంలో అసలు ఒకే రోజు అయితే ఈ చిత్రాలు విడుదల అయ్యే ఛాన్స్ లేదని మరికొందరు అంటున్నారు.ఇవే పెద్ద గందరగోళంలోకి నెడుతుంటే ఇప్పుడు ఇద్దరి ఫ్యాన్స్ కి కలిపి ఓ వార్త బయటకొచ్చింది.ఎలాగో ఈ ఇద్దరు హీరోల చిత్రాలు వస్తున్నాయి.అలాగే ఇద్దరి హీరోలతో కూడా మంచి బంధం ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.దీనితో ఈ ఇద్దరినీ కలిపి త్రివిక్రమ్ ఓ దగ్గర కూర్చోబెట్టి తమ సినిమాల ప్రమోషన్స్ కోసం ఓ ఇంటర్వ్యూ చేయనున్నారని తెలుస్తుంది.ఇది ఎంతవరకు నిజమో కానీ ఇప్పుడు ఈ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.