త్రివిక్రమ్ దర్శకత్వంలో మల్టీస్టారర్…ఈ కాంబినేషన్ వర్కౌట్ అయ్యేనా?

Tuesday, May 26th, 2020, 09:36:29 PM IST

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫుల్ స్వింగ్ లవ్ ఉన్నారు. అలా వైకుంఠ పురంలో చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తర్వత ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం RRR చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయ్యాక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు. అయితే ఆ తర్వత పట్టాలు ఎక్కే చిత్రం ఇదే అంటూ ఫిల్మ్ నగర్ లో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది.

విక్టరీ వెంకటేష్ మరియు నేచురల్ స్టార్ నాని ఇద్దరూ హీరోలుగా ఒక మల్టీ స్టారర్ చిత్రాన్ని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెంకటేష మహేష్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, నాగ చైతన్య, ఇంకా పలువురు యంగ్ హీరోలతో కలిసి నటించారు. మల్టీ స్టారర్ చిత్రాలు ఈ జనరేషన్ లో మొదలుపెట్టడానికి వెంకటేష లాంటి హీరోలు కూడా కారణం. అయితే నాని చేతిలో వరుస సినిమాలు, వెంకటేష నారప్పా, ఎఫ్ 3 చిత్రాలతో బిజీ గా ఉన్నారు. అయితే వీటి అనంతరం ఈ సినిమా తెర మీదకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ సంయక్తంగా నిర్మించే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎపుడు వస్తుందో చూడాలి.