తారక్ లో ఆ మూడు అద్భుతమైన లక్షణాలున్నాయి..త్రివిక్రమ్!

Wednesday, October 10th, 2018, 05:09:55 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ప్రతీ ఒక్క తెలుగు ప్రేక్షకుడు ఎంతగానో ఎదురు చూస్తున్న తాజా చిత్రం “అరవింద సమేత వీర రాఘవ”.ఈ చిత్రం షూటింగ్ అంతా పూర్తయ్యిపోయింది. పాటలు,ట్రైలర్ తో అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో చిత్రం విడుదలకు ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది. వీరి చిత్రానికి పెద్దగా ప్రచారాలు కూడా చెయ్యట్లేదు,కానీ త్రివిక్రమ్ మరియు తారక్ మాత్రం ఇంటర్వ్యూలు బాగానే ఇస్తున్నారు.ఇటీవలే తారక్,సునీల్ మరియు త్రివిక్రమ్ లు కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఈ చిత్ర దర్శకుడు తారక్ లో తాను గమనించినటువంటి మూడు ఉన్నతమైన లక్షణాలను తెలిపారు.

తారక్ లో తనకి నచ్చిన ఒక మూడు విషయాలు ఏమిటని సునీల్ అడగగా అంతకన్నా ఎక్కువే ఉన్నాయని త్రివిక్రమ్ సెలవిచ్చారు.తనకి తారక్ లో నచ్చిన మూడు విషయాల్లో మొదటిది ఆయన “క్రమశిక్షణ” అని పేర్కొన్నారు.ఈ మధ్య ఉన్న రోజుల్లో సమయానికి ఇంత విలువిచ్చి అంత శ్రద్ధగా ఉండే హీరోని తాను చూడలేదని పేర్కొన్నారు.రెండో లక్షణం “ఏదైనా పని చేద్దాం అనుకుంటే దాన్ని రేపు కాదు ఇప్పుడే చేద్దాం” అనే తత్వం తారక్ సొంతం అని పేర్కొన్నారు.ఒక పని అనుకుంటే దాన్ని వాయిదా వెయ్యకుండా వెంటనే చేస్తారు అని అన్నారు.ఇక మూడో లక్షణంగా తారక్ “పనిని భారంగా అనుకోకుండా చెయ్యడం” అని తారక్ ఎప్పుడు తన వృత్తిని బరువుగా ఎప్పుడు భావించలేదు అని ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టిన మొదట్లోనే దాదాపు 50 డిగ్రీల ఎండలో ఒంటి మీద చొక్కా లేకుండా కనీసం ఒక్క సారి కూడా విసుగు చెందకుండా పూర్తి చేశారని,ఆయన స్థానం వేరే ఎవరున్నా విసుగు చెందడమో ఒత్తిడిగా భావించడమో చేస్తారని,కానీ తారక్ మాత్రం అలాంటివి ఏమి చెయ్యలేదని త్రివిక్రమ్ ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తలేదు ఆయనలో ఉన్న ఉన్నత లక్షణాలని తెలియజేసారు.