“వినయ విధేయ రామ” మీద అప్పుడే ట్రోల్ల్స్..!?

Tuesday, November 6th, 2018, 10:16:12 PM IST

ఎట్టకేలకు రామ్ చరణ్ తన అభిమానులకు ఒక్క రోజు ముందే దీపావళి పండుగను అందిస్తూ బోయపాటితో చేస్తున్నటువంటి సినిమా “వినయ విధేయ రామ” టైటిల్ మరియు ఫస్ట్ లుక్ లను ఒకే రోజు విడుదల చేసి ఇన్ని రోజులు అభిమానులు పడుతున్న తాపత్రయాన్ని తెర దించేశారు.అభిమానులు కూడా ఇప్పటికే ఆ ఫస్ట్ లుక్ ని చూసి సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.వీరి పరిస్థితి బాగానే ఉంది,ఇక్కడ ఒకరి అభిమానులు ఆనందంలో మునిగి తెలుస్తున్నారు అంటే అవతల వేరే హీరో యొక్క అభిమానులు ట్రోలింగ్ లో బిజీగా ఉన్నారు అని అర్ధం.

అయితే ఈ చిత్రానికి సంబందించిన చరణ్ యొక్క లుక్ బాగానే ఉన్నా సరే ఈ చిత్ర టైటిల్ కి సంబందించి మాత్రం అభిమానుల్లో అభిప్రాయాలు వేరే విధంగా వచ్చాయి.ఇప్పుడు ఈ అంశమే మిగతా హీరోల అభిమానులకు ఆయుధంగా దొరికింది.ఈ టైటిల్ ని గమనించినట్టైతే కొంచెం క్లాస్ టచ్ లో ఉన్నా సరే ఈ చిత్రానికి ముందు బోయపాటి తీసినటువంటి ”జయ జానకి నాయక” చిత్రం యొక్క టైటిల్ తరహాలోనే ఈ చిత్ర టైటిల్ కూడా ఉందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.అయినా పెద్ద హీరోలకు ఇలాంటి సింపుల్ టైటిల్స్ తోనే భారీ హిట్లు కొట్టిన చిత్రాలు కూడా చాలా ఉన్నాయని,చరణ్ అభిమానులు సింపుల్ సమాధానం ఇస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments