సర్కార్ విడుదలకు బ్రేక్ ?

Friday, October 26th, 2018, 06:33:09 PM IST

ఇళయ దళపతి విజయ్, ఏ ఆర్ మురగదాస్ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం సర్కార్ ఈ దీపావళి సందర్భాన్ని పురస్కరించుకొని రిలీజ్ కు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకం పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని అత్యంత బారి స్థాయి లో నిర్మిస్తున్నాడు, తెలుగు లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు వల్లభనేని అశోక్ హక్కులు కొన్న సంగతి తెలిసిందే. కాగా నవంబర్ లో ఈ నవంబర్ చిత్రం విడుదల అవుతుందా లేదా అన్న సందిగ్ధ పరిస్థితి నెలకొన్నట్టు తాజా వివాదాన్ని చుస్తే తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా పై కోర్టులో కేసు నడుస్తోంది, మురగదాస్ తన కథ ను కాపీ కొట్టాడంటూ వరుణ్ రాజేంద్రన్ మద్రాస్ హైకోర్టు లో కేసు వేసాడు, ప్రస్తుతం కేసు విచారణ దశ లో ఉంది. 2007 సౌత్ ఇండియన్ ఫిలిం రైటర్స్ అసోసియేషన్ లో తాను రిజిస్టర్ చేయించిన “సెంగోల్”అనే కథను మురగదాస్ కాపీ కొట్టాడని పైగా దానికి మార్పులు చేర్పులు చేసి సర్కార్ అన్న సినిమా తీసాడని రాజేంద్రన్ ఆరోపించాడు. ఈ కేసు అపి రైటర్స్ అసోసియేషన్ లో సీరియస్ గా నే విచారణ నడుస్తోంది.

తన కథ ను కాపీ కొట్టినందుకు గాను మురగదాస్ -మారన్ ల బృందం తనకు 30లక్షలు చెల్లించాలని సదరు రచయత డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కేసు పరిశీలించిన కోర్టు ఈ నెల 30 లోగా వివరణ ఇవ్వాలని దర్శకుడు మురగదాస్ ను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ను కోరింది. అప్పటి వరకు సినిమా ని వాయిదా వేయటం కుదరదని పేర్కొంది. దీంతో ఇప్పట్లో ఈ సినిమా వాయిదా పడుతుందని చెప్పలేం. కానీ విచారణ అనంతరం ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో వేచి చూడాలి. సౌతిండియా రైటర్స్ సోసియేషన్ అధ్యక్షుడు కే. భగ్యరాజ్ ఈ విషయం పై సపండిస్తూ కథలు ఒకేలా ఉండటం అన్నది మాములు విషయమే అని, ఈ మధ్య ఈ తరహా గొడవలు ఎక్కువయ్యాయి అని, సర్కార్ కథ సెంగోల్ కథ ఒకేలా ఉండటం వాస్తవమే అని ఆయన పేర్కొన్నారు.

ఇక మురగదాస్ విషయానికొస్తే ఆయన కథలు కాపీ కొట్టటం అనేది కొత్త కాదు, ఇలాంటి గొడవలు మునుపటి సినిమాల విషయం లో కూడా జరిగాయి అందుకే అయన పై కాపీ క్యాట్ అన్న ముద్ర పడింది. గతం లో మురగదాస్ దర్శకత్వం వహించి ఘానా విజయం పొందిన చిత్రం గజినీ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ సినిమా అయినా మొమెంటో కి కాపీ అని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. విజయ్ హీరో గా వచ్చిన కత్తి సినిమా విషయం లోనూ ఇదే వివాదం, అప్పట్లో ముంజూర్ గోపి అనే రచయత కథ నాదే అంటూ కోర్టులో పోరాడాడు, చివరకు ఆతను రాజీకొచ్చి బేరం కుదుర్చుకోవటం తో కథ సుకాంతం అయినట్టు వినికిడి. ఇక ఈ సర్కార్ సినిమా పైన నెలకొన్న వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments