కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. టక్ జగదీశ్ కూడా వాయిదా..!

Monday, April 12th, 2021, 10:18:06 PM IST


కరోనా కారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీ ఇప్పటికే చాలా నష్టపోయింది. కొద్ది రోజుల క్రితం కాస్త కరోనా అదుపులోకి రావడంతో థియేటర్లు తెరుచుకోవడం, షూటింగ్‌లు, సినిమా రిలీజ్‌లు జరుగుతుండడంతో చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతోంది. అయితే కొద్ది రోజులుగా కరోనా సెకండ్ వేవ్ మళ్ళీ విజృంభిస్తుండడంతో దర్శక, నిర్మాతలు సినిమాలు రిలీజ్ చేయాలా, వద్దా అనే డైలామాలో పడ్డారు. ఈ క్రమంలోనే తమ తమ సినిమా రిలీజ్ తేదీలను వాయిదా వేసుకుంటున్నారు.

అయితే ఇప్పటికే నాగచైతన్య, శేఖర్‌కమ్ముల కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం లవ్‌స్టోరీ ఏప్రిల్‌ 16న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో ఆడియన్స్‌ థియేటర్‌కు వచ్చి చూసే పరిస్థితులు కనిపించకపోవదంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నాని టక్‌ జగదీష్‌ కూడా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏప్రిల్‌ 23న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరోనా కారణమా లేక మరో ఇతర కారణమా అనేది చెప్పకపోయినా త్వరలోనే రిలీజ్ తేదీనీ ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.