సినీ పరిశ్రమలో మరొక అత్యాచారం!? కేసు పెట్టిన నటి…

Sunday, November 17th, 2019, 02:44:47 PM IST

సినీమా పరిశ్రమ అంటే అదొక రంగుల లోకం. పేరు కోసం ప్రాకులాడే వారు కూడా ఎక్కువగా వుంటారు. అయితే అలా ఎదగాలంటే ఎన్నో కష్టాలు దాటి రావాలి, సహనటులు తో, సినీ పరిశ్రమలోని పలువురి తో సన్నిహితంగా ఉండాలి. ఇది ఇలా ఉంటే క్యాస్టింగ్ కౌచ్ అంటే భారత దేశంలోని సినీ పరిశ్రమ లో ఈ మధ్య విపరీతంగా వినిపిస్తున్న పేరు. అయితే తాజాగా ఒక నటి కాస్టింగ్ కౌచ్ మోసానికి గురి అయింది.

బాలీవుడ్ లో హిందీలో రియాలిటీ షో లు చేస్తూ ఉండేది ఆ నటి. ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ఒక జూనియర్ ఆర్టిస్ట్ స్నేహం పెంచుకున్నాడు. అయితే స్నేహంగా వుంటూ ఆ మంచితనం ముసుగులో నటి పై కోరిక పెంచుకున్నాడు. అక్టోబర్ 13 న పార్టీ కి ఆమెని ఒక హోటల్ కి తీసుకెళ్లి, డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసాడు ఆ యువకుడు. అయితే ఆ నటి గర్భం దాల్చడం తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయినప్పటికీ ఆ యువతీ అతనిని పెళ్లి చేసుకోమని అడగగా అతడు అప్పటినుండి కనిపించడం మానేశాడు. అయితే తదుపరి అతని కోసం ఆ యువకుడి తల్లి దండ్రులను సంప్రదించగా వారు కూడా ఆ యువకుడి లాగ ప్రవర్తించడం తో ఆ యువతీ పోలీసులని ఆశ్రయించింది. అతనిని వినీత్ వర్మగా గుర్తించి, పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.