యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో “ఈటీవీ” సీరియళ్ల హవా..!

Wednesday, December 5th, 2018, 01:12:38 AM IST

తెలుగు ప్రేక్షకుల్లో బుల్లితెరకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.అందులోను సీరియళ్ల విషయంలో మాత్రం మహిళలకు వీటికి విడదీయరాని బంధం ఏర్పడిపోయింది.తెలుగు ఛానెళ్లలో ఒక్కో ఛానెల్ వారిది ఒక్కో ప్రత్యేకత కొన్ని సీరియళ్లు సాయంత్రం వేళల రాత్రి పూట టీఆర్పీ లలో అదరగొడితే మరికొన్ని ఛానెళ్ల యొక్క సీరియళ్లు మాత్రం యూట్యూబ్ లో అదరగొడుతున్నాయి.ఈటీవీ కి చెందినటువంటి సీరియళ్లు మాత్రం యూట్యూబ్ లో ప్రతీ రోజు ట్రెండింగ్ లో నిలుస్తూ కనబడుతుంటాయి.

అందులోను టాప్ 10 ట్రెండింగ్ లో అయితే ఖత్చితంగా ఉంటాయి.ఒక్కో సారి అయితే టాప్ 3 ట్రెండింగ్ లోకి కూడా వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.ముఖ్యంగా “అత్తారింటికి దారేది”, “మనసు మమత” మరియు “నా పేరు మీనాక్షి” సీరియళ్లు ట్రెండింగ్ లో ఉంటాయి.ఈ మూడింటిలో ఇదొక్కటి ఒక్క రోజులో సునాయాసంగా 5 లక్షల వీక్షకులను సంపాదించుకుంటుంది.దీన్ని బట్టే మనం అర్ధం చేసుకోవచ్చు ఈటీవీ సీరియళ్ల హవా యూట్యూబ్ లో ఎలా ఉందొ..