ఈ సారి బుల్లితెర పైకి రాబోతున్న రామ్,అనుపమ.!

Tuesday, January 8th, 2019, 05:10:54 PM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ మరియు అందాల నటి అనుపమ పరమేశ్వరన్లు బుల్లి తెరపై సందడి చేసేందుకు రాబోతున్నారు.ఈ ఇద్దరు హీరో హీరోయిన్లుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “హలో గురు ప్రేమ కోసమే”.త్రినాథరావు మార్క్ లోనే మామ అల్లుళ్ళ మధ్య నడిచే సంభాషణలను ఆధ్యంతం కామెడీగా తెరకెక్కించడంలో ఈ చిత్రంతో కూడా సక్సెస్ అయ్యారు.దేవిశ్రీ అందించిన సంగీతం, రామ్ మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు,రామ్,అనుపమల మధ్య కెమిస్ట్రీ యువతకు ఆకట్టుకునే అంశాలు ఇలా చాలా ఉండేసరికి అన్ని వర్గాల ప్రేక్షకులు బాగానే ఆదరించారు.ఇప్పుడు ఇదే సినిమా “స్టార్ మా” ఛానెల్లో ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కాబోతుంది.మరి బుల్లితెరపై కూడా వీరి హంగామా ఎలా ఉండబోతుందో చూద్దాం.