జీ5 లో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న “జెర్సీ”

Friday, June 14th, 2019, 11:04:29 PM IST

టాలీవుడ్ లో నాచురల్ స్టార్ నాని నటించిన అన్ని సినిమాల్లోనూ తన కెరీర్ లో బెస్ట్ ఇచ్చిన సినిమా ఏదన్న ఉంది అంటే అది “జెర్సీ” సినిమాయే అని చెప్పాలి.నాని హీరోగా శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందికోవడమే కాకుండా సినిమా చూసిన ప్రతీ ప్రేక్షకుడిగా మంచి అనుభూతిని మిగిల్చింది.వసూళ్ల పరంగా ఊహించిన స్థాయిలో ప్రభావం చూపకపోయినా సరే ఒక మంచి సినిమాను చూసామనే అనుభవం అయితే ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరికి కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఇప్పుడు ఈ సినిమా “జీ5” లో స్టీమ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.ఈ సినిమాకు సంబంధించి మొట్ట మొదటి ప్రీమియర్ రేపు పడనుంది అని జీ5 వారు వారి ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసారు.ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్ట్రీమింగ్ ప్రేక్షకులు కామెంట్స్ లో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ సినిమా వారి స్ట్రీమింగ్ యాప్ అయినటువంటి జీ5 లోనే చూడాల్సి వస్తుంది.అందువల్ల దానికి ఖచ్చితంగా సభ్యత్వం తప్పనిసరి.నాని మరియు గౌతమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మ్యాజికల్ మూవీకి సంగీత సంచలనం అనిరుద్ సంగీతం అందించారు.