సైరా నుండి .. మరో ఆసక్తికర న్యూస్ ?

Thursday, October 11th, 2018, 03:27:53 PM IST

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సైరా చిత్రం ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడే క్లైమాక్స్ కు సంబందించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించి ఇందులో అమితాబ్ కీ రోల్ పోషిస్తున్న పాత్రకు సంబందించిన పోస్టర్ ని ఈ రోజు విడుదల చేసారు. నేడు అమితాబ్ పుట్టినారు రోజు కావడంతో అయనకు గ్రీటింగ్ తెలుపుతూ పోస్టర్ విడుదల చేసారు .. దాంతో పాటు ఈ సినిమాలో కీ రోల్స్ పోషిస్తున్న కన్నడ నటుడు కిచ్చా సుదీప్, తమిళ హీరో విజయ్ సేతుపతి లకు సంబంచిన ఫోటోలు కూడా విడుదల చేసారు. మొత్తానికి సైరా సినిమాపై ఆసక్తి పెంచేలా ఈ పోస్టర్స్ ఉన్నాయి. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తుండగా పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.