సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై బయటకొస్తున్న షాకింగ్ అంశాలు?

Friday, June 19th, 2020, 03:30:30 PM IST

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య చేసుకున్న ఘటన అన్ని సినీ ఇండస్ట్రీ ప్రేక్షకులను తీవ్రంగా కలచి వేసింది. ఈ బాధను పక్కన పెడితే అసలు ఇంత చిన్న వయసులో సుశాంత్ కు చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది?

తాను కావాలని ఆత్మ హత్య చేసుకున్నాడా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్నది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్నగా మారింది. అయితే అతని హత్యకు అనేక కారణాలు కనిపిస్తుండగా.. అసలు అది ఆత్మహత్యలా లేదు అని చెప్పడానికి పలు సందేహాలు తావివ్వడం ఆశ్చర్యకరంగా మారింది.

తాను ఆత్మహత్య చేసుకోడానికి ముందు తన ఇంటి సీసీటీవీ ఫుటేజ్ మిస్సయ్యిందని అలాగే తాను ఉరి వేసుకున్న చోట సుశాంత్ వి ఎలాంటి వేలి ముద్రలు కూడా లేవని తెలిసింది. ఇదే షాకింగ్ అనుకుంటే అక్కడి సీనియర్ డైరెక్టర్ మహేహ్ భట్ కు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రేహ చక్రబర్తికు ఏదో సంబంధం ఉందని వారు కూడా ఈ ఘటనకు కారణభూతులు అయ్యి ఉంటారని అనేక కోణాలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.